సినీకార్మికుల్ని ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో ఏర్పడిన కరోనా క్రైసెస్ చారిటీ మనకోసం కు సి సి సి కి. ప్రముఖ సీనియర్ నటులు గిరిబాబు గారి తనయుడు రఘుబాబు లక్ష రూపాయల విరాళాన్ని అందించారు ఈ లక్ష రూపాయలను గురువారం నెఫ్ట్ ద్వారా సీసీసీ కి ట్రాన్స్ఫర్ చేశారు. అలాగే ప్రొడక్షన్ మేనేజర్ యూనియన్ కి 25 వేల రూపాయలను, టీవీ ఆర్టిస్ట్ యూనియన్ కి 25 వేల రూపాయలను, కాదంబరి కిరణ్ మనం సైతం కి 25 వేల రూపాయలను ఇలా మొత్తం ఒక లక్షా 75 వేల రూపాయలను విరాళంగా రఘుబాబు ఇవ్వడం జరిగింది.