పూరీ హీరో శంకరే కాదండోయ్. మన హైద్రాబాదీ పోలీసులు కూడా టూ ఇస్మార్టే. ఈ మధ్యన బహిరంగ ప్రదేశాల్లో స్మోకింగ్ చేసినందుకు మన హైద్రాబాద్ పోలీసులు ఇస్మార్ట్ స్ట్రిక్ట్‌గా 200 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఆ ఫైన్ ఇప్పుడు మన ఇస్మార్ట్ శంకర్ హీరో రామ్కీ వేసేశారు. సినిమా షూటింగ్లో భాగంగా యంగ్ హీరో రామ్ చార్మినార్ పరిసర ప్రాంతాల్లో దమ్ముకొట్టాల్సిన సందర్భం వచ్చింది. మరి మన చార్మినార్ పోలీసులు ఊరుకుంటారా.? ఇస్మార్ట్‌గా అక్కడికి చేరి, మన శంకర్ దగ్గర 200 రూపాయలు జరిమానా వసూలు చేశారు.
'ఇస్మార్ట్ శంకర్'లో రామ్ ఊర మాస్ క్యారెక్టర్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఊరమాస్ అంటే కేరాఫ్ అడ్రస్ దమ్ము లాగుడే కదా. అందుకే రామ్ ఈ ఫైన్ కట్టాల్సి వచ్చింది. ఇదంతా బాగానే ఉంది. కానీ, షూటింగ్ సమయాల్లో ఇలాంటివి చాలా చాలా జరుగుతుంటాయి. కానీ, బయటికి రావు. మన ఇస్మార్ట్ టీమ్ మాత్రం ప్రమోషన్‌కి పనికొచ్చేది ఏదీ వదిలిపెట్టాలనుకోవడం లేదుగా. దొరికిన దాన్ని దొరికినట్లే బాగా వాడేస్తోంది.
మొన్న లీకేజీ వివాదం.. ఇప్పుడు స్మోకింగ్ వివాదం.. అదిరిందయ్యా జగనూ నీ వాడకం. పూరీ కనెక్ట్స్ బ్యానర్లో రూపొందుతోన్న ఈ సినిమా జూలై 18న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు ఈ సినిమాలో.