పబ్లిక్ ప్లేస్‌లో సిగరెట్ తాగినందుకు హీరో రామ్ పోతినేనికి హైద్రాబాదీ పోలీసులు 200రూపాయలు జరిమానా విధించిన సంగతి తెలిసిందే. 200 రూపాయల జరిమానా కట్టి రామ్ అక్కడి నుండి వెళ్లిపోయారు. ఈ వార్త న్యూస్‌లో తెగ వైరల్ అయిపోయింది. ఈ వైరల్ ఇష్యూపై రామ్ ఇంతవరకూ స్పందించలేదని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ప్రశ్నలు గుప్పించగా, ఎట్టకేలకు రామ్ స్పందించాడు. 'నా టైం, పబ్లిక్ టైం వేస్ట్ చేయడం ఇష్టం లేక ఇప్పటివరకూ స్పందించలేదు తమ్మీ.. నేను ఫ్రీ టైంలో సిగరెట్ తాగలేదు.. షాట్‌లోనే సిగరెట్ తాగాను.
చూస్తారుగా, టైటిల్ సాంగ్‌లో ఓ స్టెప్‌లో సిగరెట్ కాల్చిన షాట్.. అయినా కూడా చట్టాన్ని గౌరవించి నేను జరిమానా కట్టేశాను.. లైట్ తీస్కో.. పని చేస్కో.. ' అంటూ తనదైన శైలిలో ట్వీటేశాడు రామ్. జరిమానా కట్టిన హీరో.. అంటూ స్క్రోలింగ్‌లు వేసుకున్న వారికీ, సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ చేసిన వారికీ ఇస్మార్ట్‌గా రామ్ సమాధానమిచ్చాడు. జూలై 18న 'ఇస్మార్ట్ శంకర్' మూవీ రిలీజ్ కానుంది.
పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ పక్కా హైద్రాబాదీ కుర్రోడిలా డిఫరెంట్ గెటప్‌లో మాస్.. ఊరమాస్ అప్పీల్ ఇస్తున్న సంగతి తెలిసిందే. నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా పూరీ కనెక్ట్స్ బ్యానర్‌లో రూపొందుతోంది.