బిగ్‌బాస్‌ సెగలు.. హోస్ట్‌లో గుబులు గుబులు!

మరిన్ని వార్తలు

ఇంకొంచెం మసాలా.. అంటూ నాని హోస్ట్‌గా 'బిగ్‌బాస్‌ 2'లో, చెప్పినట్లుగానే స్టఫ్‌కి కాస్త మసాలా ఎక్కువే దట్టించారు. ఇక ఇప్పుడు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 వేడి మొదలైంది. మసాలా అయితే దట్టించారు కానీ, రెండో సీజన్‌కి హోస్ట్‌ నాని స్టార్‌డమ్‌ సరిపోలేదనే విమర్శలు వచ్చాయి. అందుకే ఈ సారి బిగ్‌బాస్‌ నిర్వాహకులు హోస్ట్‌ విషయంలో నెక్ట్స్‌ లెవల్‌లో ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా స్టార్‌ హీరోనే ఈ ప్రోగ్రాంకి హోస్ట్‌గా ప్లాన్‌ చేశారు. అందులో భాగంగా, చిరంజీవి, వెంకటేష్‌, నాగార్జున.. ఇలా స్టార్‌ హీరోలను లైన్‌లో దించారు.

 

కానీ, చిరంజీవి నుండి ఫుల్‌గా నో వేకెన్సీ వచ్చేసింది. ఇక వెంకీ విషయంలో చివరి మినిట్‌ వరకూ హోప్స్‌ ఉన్నాయి. కానీ, అది కూడా జరగలేదు. ఆఖరికి నాగార్జుననే ఈ షోకి హోస్ట్‌గా నిర్ణయించేశారు. నాగార్జున హోస్ట్‌గా ఇటీవల ఓ ప్రీ ప్రోమో విడుదల చేశారు కూడా. ఇక త్వరలోనే బిగ్‌బాస్‌ 3 మా టీవీలో ప్రారంభం కానుంది. అయితే, ఇంకా ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్‌పై మాత్రం క్లారిటీ రాలేదు. ఎవరో కొందరి పేర్లు సోషల్‌ మీడియాలో ప్రచారంలో ఉన్నా, అఫీషియల్‌ క్లారిటీ కావవి.

 

ఇదిలా ఉంటే, నాగార్జున విషయానికి వస్తే, బిగ్‌బాస్‌ సీజన్‌ 2 సమయంలో నాగ్‌, నాని కలిసి 'దేవదాస్‌' సినిమాలో నటిస్తున్నారు. బిగ్‌ స్క్రీన్‌ పాట్నర్స్‌ అయిన వీరిద్దరూ కలిసి ఆ టైంలో ఒకరోజు స్మాల్‌ స్క్రీన్‌పై సందడి చేసిన సంగతి తెలిసిందే. కాసేపు స్క్రీన్‌పై కనిపిస్తేనే నాగ్‌ ఆ షోకి గ్లామర్‌ తెచ్చేశాడు. ఇక ఫుల్‌ టైం ఆ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తే, ఆ కిక్కే వేరప్పా. అయితే, బిగ్‌బాస్‌ మొదటి హోస్ట్‌ ఎన్టీఆర్‌ని నాగ్‌ మ్యాచ్‌ చేస్తాడో లేదో అనే గుబులు నాగ్‌ ఫ్యాన్స్‌ని టెన్షన్‌ పెడుతోందిప్పుడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS