తెలుగమ్మాయికి కాబోయే 'వరుడు' అతడేనా.?

మరిన్ని వార్తలు

తెలుగమ్మాయ్‌ అంజలి త్వరలో పెళ్లి చేసుకోబోతోందా..? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి కోలీవుడ్‌ నుండి. అవును కోలీవుడ్‌ నుండే. ఎందుకంటే అచ్చమైన తెలుగమ్మాయి అయినా అంజలికి అసలు సిసలు స్టార్‌డమ్‌ దక్కింది మాత్రం తమిళంలోనే కదా. తెలుగులోనూ వచ్చిన అవకాశాల్ని బాగానే వినియోగించుకుంది. కానీ, స్టార్‌డమ్‌ మాత్రం దక్కించుకోలేకపోయింది అంజలి. ఇకపోతే, తాజాగా అంజలి 'సింధూబాద్‌' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. విజయ్‌ సేతుపతి ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

 

గత శుక్రవారం విడుదల కావల్సిన ఈ సినిమా వచ్చే శుక్రవారానికి వాయిదా పడింది. అంటే ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తన కెరీర్‌లో ప్రత్యేకమైనదిగా అంజలి అభివర్ణిస్తోంది. పల్లెటూరి యువతిగా చాలా నేచురల్‌ గెటప్‌లో కనిపించనుందట అంజలి ఈ సినిమాలో. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే అంజలి తన పెళ్లి గురించి పెదవి విప్పింది. తనతో నటించిన హీరోలందరికీ పెళ్లిళ్లయ్యాయట. కానీ, జైకి ఒక్కడికే పెళ్లి కాలేదట. అయితే, జై ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో తనకి తెలియదని అంజలి చెప్పుకొచ్చింది. గతంలో జై, అంజలి మధ్య ప్రేమ, పెళ్లి పీటలదాకా వెళ్లిన సంగతి తెలిసిందే.

 

అయితే, ఆ తర్వాత అది బ్రేకప్‌ అయ్యిందనే ప్రచారం కూడా జరిగింది. కానీ, ఇప్పుడు అంజలి మాటల్లో ఆంతర్యమేంటో కానీ, పెళ్లంటూ చేసుకుంటే, తమిళ కుర్రాడినే పెళ్లి చేసుకుంటానని అంజలి చెబుతోంది. ఆ మాటలోని అర్ధం, పరమార్ధం అంజలికే తెలియాలి. ప్రస్తుతం అంజలి తమిళ సినిమాలతో పాటు, తెలుగు సినిమాలతోనూ బిజీగా గడుపుతోంది. అనుష్క, మాధవన్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న 'సైలెన్స్‌'లో అంజలి కీలక పాత్ర పోషిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS