మ‌హా స‌ముద్రంలో సిద్దార్ధ్‌?

మరిన్ని వార్తలు

ఆర్‌.ఎక్స్ 100తో ఆక‌ట్టుకున్న ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి. ఇప్పుడు ర‌వితేజ కోసం ఓ క‌థ త‌యారు చేసుకున్నాడు. అదే... `మ‌హా స‌ముద్రం`. డిస్కో రాజా అయిపోయిన త‌ర‌వాత ఈ సినిమానే ప‌ట్టాలెక్కుతుంది. ఇందులో మ‌రో క‌థానాయ‌కుడికీ చోటుంది. ఆ పాత్ర సిద్దార్థ్‌కి ద‌క్కిన‌ట్టు స‌మాచారం. హీరోతో స‌మానమైన పాత్ర ఇద‌ని, ర‌వితేజ - సిద్దార్థ్ పాత్ర‌లు రెండూ పోటాపోటీగా ఉంటాయ‌ని తెలుస్తోంది. బొమ్మ‌రిల్లుతో తెలుగునాట త‌న‌కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సిద్దార్ధ్‌... ఆ త‌ర‌వాత ఆ స్థాయి సినిమా ఏదీ చేయ‌లేదు.

 

ఇప్పుడు పూర్తిగా త‌మిళ చిత్ర‌సీమ‌వైపే దృష్టి పెట్టాడు. తెలుగులో సిద్దూ పేరుని అంతా మ‌ర్చిపోతున్న ఈ త‌రుణంలో త‌న‌కు ఇలాంటి అవ‌కాశం రావ‌డం నిజంగా గ్రేటే. త్వ‌ర‌లోనే సిద్దూ ఎంట్రీకి సంబంధించిన ఓ అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా కోసం క‌థానాయిక‌ల్ని ఎంపిక చేసే ప‌నిలో ఉంది చిత్ర‌బృందం. వీళ్ల‌పై కూడా త్వ‌ర‌లోనే ఓ స్ప‌ష్ట‌త రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS