అవునండీ రానా నిర్మాతగా కూడా మారబోతున్నారు. రానా తలచుకుంటే ఏదైనా చేయగలడు. మల్టీ టాలెంటెండ్. నటనతో పాటు, మరికొన్ని ఎక్స్‌ట్రా యాక్టివిటీస్‌లోనూ రానాకి ఆశక్తి ఉంది. ఇంతవరకూ విలక్షణ పాత్రల్లో సత్తా చాటాడు. ఇకపై విలక్షణ సినిమాలకు నిర్మాతగా తన అభిరుచిని చాటుకోవాలనుకుంటున్నాడట. ఆల్రెడీ రానా గతంలోనూ ఆ దిశగా కొన్ని ప్రయత్నాలు చేశాడు. తాజాగా రానా తమిళంలో ఓ సినిమాని నిర్మించాలనుకుంటున్నాడట.
అదే నాని హీరోగా తెరకెక్కిన 'జెర్సీ'. ఈ సినిమా తెలుగులో మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని అల్లు అరవింద్, దిల్‌రాజు, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా హిందీలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఓ ప్రముఖ హీరో ఈ సినిమాలో నటించే అవకాశముందనీ సమాచారం. సో హిందీలో ఛాన్స్ లేదు కనుక, తమిళంలో ఈ సినిమాని రానా రీమేక్ చేయాలనుకుంటున్నాడట.
హీరో కూడా దొరికేశాడు. తమిళ యంగ్ హీరో విష్ణు విశాల్ ప్రధాన పాత్రలో రానా ఈ సినిమాని నిర్మించబోతున్నాడన్న వార్త కోలీవుడ్ మీడియా ద్వారా టాలీవుడ్‌లోనూ చక్కర్లు కొడుతోంది. ఓ ప్రముఖ తమిళ దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించే అవకాశాలున్నాయట. ప్రస్తుతం రానా హీరోగా చాలా బిజీగా ఉన్నాడు. 'విరాటపర్వం', 'హాథీ మేరే సాథీ' తదితర చిత్రాల్లో నటిస్తున్నాడు. కొన్ని గెస్ట్ క్యారెక్టర్స్ కూడా రానా కోసం ఎదురు చూస్తున్నాయి. భాషతో సంబంధం లేకుండా కథ నచ్చితే, ఎక్కడైనా నటించేందుకు రానా ఎప్పుడూ ముందుంటాడన్న సంగతి తెలిసిందే. అయితే, నిర్మాతగా కూడా అలాంటి ఇమేజ్‌నే రానా సొంతం చేసుకుంటాడా.? చూడాలిక.