ఆగస్ట్ 15న విడుదల కావల్సిన 'సాహో' చిత్రం పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఇంతవరకూ పోస్ట్‌పోన్ అయిన విషయాన్ని 'సాహో' టీమ్ అఫీషియల్‌గా కన్‌ఫామ్ చేయలేదు. కానీ, ప్రచారం మాత్రం జోరుగా సాగింది. లేటెస్ట్‌గా 'సాహో' టీమ్ రిలీజ్ డేట్‌ని పోస్ట్‌పోన్ చేశామనీ, అదే నెలలో అంటే ఆగస్ట్ 30న 'సాహో' ప్రేక్షకుల ముందుకు రానుందనీ తెలిపారు.
'సాహో'ని అద్భుతమైన విజువల్ యాక్షన్ వండర్‌గా రూపొందించాం. ఆ ఫీల్‌నీ, థ్రిల్‌నీ ఆడియన్స్ మరింత క్వాలిటీతో ఎంజాయ్ చేయడం కోసమే, ఈ ఆలస్యం. లేట్ అయినా, 'సాహో' లేటెస్ట్‌గా రావడం ఖాయం. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమాకి విడుదల దగ్గరయిన తరుణంలో ఏ చిన్న విషయంలోనూ రాజీ పడకూడదనే విడుదల తేదీని పొడిగించామనీ, ఫ్యాన్స్ ఈ విషయాన్ని అర్ధం చేసుకోవాలనీ చిత్ర యూనిట్ కోరింది. అంటే 'సాహో' టీమ్ కన్‌ఫామ్ చేసినట్లుగా విడుదలకు ఇంకా 40 రోజుల సమయం మిగిలి ఉంది.
ఈ గ్యాప్‌లో ఫ్యాన్స్‌ని ఏమాత్రం డిజప్పాయింట్ చేయకుండా, 'సాహో'కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్‌తో ఎంటర్‌టైన్ చేయనున్నారట. ఇంతవరకూ వచ్చిన ప్రచార చిత్రాలు ఓ ఎత్తు, ఇకపై విడుదలయ్యే ప్రచార చిత్రాలు ఇంకో ఎత్తు అన్నట్లుగా 'సాహో' ప్రమోషన్స్‌ని ప్లాన్ చేస్తున్నారట. 'బాహుబలి' తర్వాత ప్రబాస్ నుండి వస్తున్న సినిమా కావడంతో, ఆ అంచనాల్ని అందుకునే విధంగా ఈ సినిమాని పక్కా క్వాలిటీతో ప్రేక్షకులకు అందించాలన్న కసితో చిత్ర యూనిట్ హార్డ్ వర్క్ చేస్తోంది. హీరోయిన్‌గా బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే.