నారా రోహిత్ ఎప్పటికీ గుర్తుంచుకొనే ప్రత్యేకమైన రోజు మే 5. ఆయన నటించిన మొదటి చిత్రం బాణం 2009లో మొదలైంది ఈ రోజే. ఈ స్పెషల్ డేకి, నారా రోహిత్ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ట్విట్టర్‌లో జాయిన్ అయ్యారు. @IamRohithNara అనే హ్యాండిల్‌తో ట్విట్టర్‌లో అడుగుపెట్టిన ఆయన, 'బాణం' మూవీ సెట్స్‌పై తొలి రోజు నాటి తన ఫొటోగ్రాఫ్‌ను పోస్ట్ చేశారు. తన తొలి ట్విట్‌ను తన మెంటార్, పెదనాన్న చంద్రబాబునాయుడు, కజిన్ నారా లోకేష్‌కు ట్యాగ్ చేశారు.
"2009లో ఈ రోజు, ఇది 'బాణం' మూవీలో నా ఫస్ట్ షాట్. ఈ సందర్భంగా నా మెంటార్, పెదనాన్న చంద్రబాబునాయుడు గారు, డియరెస్ట్ లోకేష్ అన్న సరసన ట్విట్టర్‌లో జాయిన్ అవడం గౌరవంగా, ఆనందంగా ఉంది. ఒక గొప్ప వ్యక్తి అన్నట్లు, కుటుంబం అనేది జీవశాస్త్రం కాదు, అది ఒక విశ్వాసం" అంటూ నారా రోహిత్ తన తొలి ట్వీట్‌ను పోస్ట్ చేశారు. తన తదుపరి సినిమా కోసం సన్నగా, ఫిట్‌గా తయారయ్యారు నారా రోహిత్. లాక్‌డౌన్ ఎత్తివేసిన అనంతరం ఆ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నారు.