గత పదిహేనేళ్లుగా హీరోగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ సుమంత్‌కి కెరీర్‌లో చెప్పుకోదగ్గ సినిమాలంటే కొన్ని మాత్రమే. 'గోల్కొండ హైస్కూల్', గోదావరి' తదితర చిత్రాలు సుమంత్‌కి మంచి పేరు తీసుకొచ్చి పెట్టాయి. 'ప్రేమకథ' సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు సుమంత్. తాత అక్కినేని, మేనమామ నాగార్జున పోలికలు కలబోసిన రూపం. హీరోగా తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. ఈ మధ్య చాలా గ్యాప్ తీసుకుని సినిమాలు చేస్తున్నాడు. 'నరుడా డోనరుడా' అంటూ అడల్ట్ బేస్ కాన్సెప్ట్‌తో వచ్చాడు. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ సినిమా తెలుగులో బాగా నిరాశ పరిచింది. కొండంత ఆశలు పెట్టుకున్నాడు ఈ సినిమాపై సుమంత్.
అయితే మళ్లీ ఇప్పుడు 'మళ్లీ రావా' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ రోజు నుండి ఈ సినిమా ధియేటర్స్‌లో సందడి చేయనుంది. ఓ ప్యూర్ లవ్‌స్టోరీగా ఈ సినిమా తెరకెక్కిందట. చాలా లవ్ స్టోరీస్‌లో నటించాడు ఇంతవరకూ సుమంత్. అయితే వాటిన్నింట్లోకీ 'మళ్లీ రావా..' భిన్నంగా ఉంటుందట. గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాని తెరకెక్కించారు. కాగా ఇకపై సుమంత్ కొత్త దర్శకులతోనే సినిమాలు చేయాలనుకుంటున్నాడనే సంకేతాలు పంపిస్తున్నాడు. అవును కొత్త దర్శకులతో పని చేస్తే, కొత్త కొత్త కాన్సెప్ట్‌లు బయటికి వస్తాయి.
తెగ బిజీగా సినిమాలు చేయాలని సుమంత్ అనుకోవడం లేదంట. గ్యాప్ తీసుకున్నా ఓ మంచి సినిమాలో నటించాననే తృప్తి ఉంటే చాలంటున్నాడు. ఇప్పటికే చాలా మంది కొత్త డైరెక్టర్లు కొత్త కథలతో సుమంత్‌ని కలుస్తున్నారట. కథ నచ్చితే వెంటనే ఆ సినిమాలో నటిస్తానంటున్నాడు. అయితే కథలో కొత్తదనం ఉండాలంటున్నాడు. ప్రయోగాత్మక చిత్రాల్లో నటించేందుకూ సుమంత్ సిద్ధంగా ఉన్నాడట. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు సినిమాలున్నాయి.