మెగాస్టార్ వారసులుగా ఇండస్ట్రీ లోకి వచ్చిన వాళ్ళు చాలామందే ఉన్నారు. ఇప్పుడు అదే కోవలోకి మరో మెగా హీరో ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ భర్త అయిన కళ్యాణ్ కనుగంటి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటి వరకు నటనలో, మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్న కళ్యాణ్ స్టైలిష్ లుక్ తో ఈ సినిమాలో కనిపించనున్నాడు.
గతంలో 'జత కలిసే' చిత్రానికి దర్శకత్వం వహించిన రాకేష్ శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయని, రామ్ చరణ్ దగ్గరుండి ఈ సినిమా వ్యవహారాలు చూసుకుంటున్నట్టు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి నుండి ఆమోదం లభించిన వెంటనే ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉంది.
ఈ చిత్రానికి 'ఈగ' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నిర్మించిన 'సాయి కొర్రపాటి' నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మొన్నటి వరకు సాఫ్ట్ బాయ్ గా కనిపించిన కళ్యాణ్, ఇప్పుడు మేకోవర్ ఛేంజ్ చేసి కొత్త లుక్ లో దర్శనమిస్తున్నాడు.