దాదాపుగా హాస్యనటులుగా ఓ వెలుగు వెలిగినవాళ్లంతా.. ఏదో ఓ సమయంలో రాజకీయ రంగ ప్రవేశం చేయాలని చూసినవాళ్లే. బాబూ మోహన్ నుంచి ఫృథ్వీ వరకూ - అందరూ అదే దారిలో నడిచారు. వేణుమాధవ్‌కి కూడా ఆ ఆలోచన ఉండేది. ఎం.ఎల్.ఏ కావాలని కలలుకనేవాడు. తన స్వగ్రామం కోదాడలో కొన్ని సేవా కార్యక్రమాల్ని నిర్వహించాడు. ఎప్పుడో ఒకప్పుడు ఆ ప్రాంతంలో ఎం.ఎల్.ఏగా తిరగాలని బలంగా కోరుకున్నాడు.
టీడీపీ నాయకులతో వేణుకి బాగా సన్నిహిత సంబంధాలున్నాయి. టీడీపీ పార్టీ ప్రచార కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనేవాడు. 2014 అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ పార్టీ టికెట్ ఆశించాడు. నామినేషన్ వేశాక, బీఫామ్ మరొకరికి దక్కింది. దాంతో నామినేషన్‌ని ఉపసంహరించుకోవాల్సివచ్చింది. ఆరోగ్య కారణాల వల్ల 2019 ఎన్నికలలో పోటీ చేయలేకపోయాడు. అలా.. ఎం.ఎల్.ఏ అవ్వాలన్న కోరిక తీరకుండానే పోయింది.