బిగ్‌బాస్‌లో గ్రూప్స్‌ ఎక్స్‌ఛేంజ్‌ అయ్యాయోచ్‌.!

మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌లో మొదటి నుండీ గ్రూప్స్‌ సాంప్రదాయం అనేది రన్‌ అవుతూ వస్తోంది. గత సీజన్‌ కంటెస్టెంట్స్‌ కూడా ఇందుకు అతీతం కాదు. ఇక ఈ సీజన్‌ విషయానికి వస్తే, శ్రీముఖి, బాబా భాస్కర్‌ ఒక గ్రూప్‌ని మెయింటైన్‌ చేయగా, వరుణ్‌, వితిక, రాహుల్‌, పునర్నవి ఈ నలుగురూ ఓ గ్రూప్‌గా ఉంటున్నారు. తాజా ఎపిసోడ్‌తో ఈ గ్రూప్స్‌లో చిన్న చిన్న లుకలుకలు వచ్చాయి. రీజన్‌ ఏదైనా కానీ, సందు చూసి, పొగ పెట్టేవాళ్లు ఎప్పుడూ ఉంటారు కదా..! అలా వరుణ్‌ సందిచ్చాడు.

 

శ్రీముఖి పొగ పెట్టేసింది. రాహుల్‌, వరుణ్‌ మధ్య వచ్చిన చిన్న క్లాష్‌ని పెద్దది చేసే ప్రయత్నంగా శ్రీముఖి స్కెచ్‌ ప్రిపేర్‌ చేసేసింది. శ్రీముఖి స్కెచ్‌కి రవికృష్ణ తోడయ్యాడు. 'అత్తా కోడళ్ల' టాస్క్‌కి సంబంధించి ఈ కొత్త పరిణామం చోటు చేసుకుంది. రాహుల్‌తో వరుణ్‌ గొడవకు దిగగా, శ్రీముఖి, వరుణ్‌ని బాగా తోమేసింది. దాంతో వరుణ్‌ మరింత రెచ్చిపోయాడు.

 

తర్వాతి ఎపిసోడ్స్‌లో కూడా వరుణ్‌, వితిక, శ్రీముఖి, రవికృష్ణ ఒక గ్రూప్‌గా కనిపిస్తున్నారు. ఇది బిగ్‌బాస్‌లో ఊహించని ట్విస్ట్‌. టైమ్‌ కోసం ఎదురు చూస్తున్న శ్రీముఖి ఇక విజృంభించేస్తోంది అని పునర్నవి సెటైర్‌ వేసేసింది. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌ అందరిలోనూ, ఫ్రెండ్‌షిప్‌ బ్రేక్‌ అయితే, జెన్యూన్‌గా ఫీలయ్యేది రాహుల్‌, పునర్నవి మాత్రమే. అలాంటి కష్టం పాపం వీరిద్దరికే వచ్చిందిప్పుడు. ఈ సిట్యువేషన్‌ని ఈ ఇద్దరూ ఎలా ఫేస్‌ చేస్తారో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS