విశాల్‌ నిశ్చితార్ధం క్యాన్సిల్‌ కాలేదట!

మరిన్ని వార్తలు

తమిళ హీరో విశాల్‌, హైద్రాబాదీ అమ్మాయి అనీషా రెడ్డిల వివాహం రద్దయ్యిందంటూ ఈ మధ్య వార్తలు వినిపించాయి. అయితే, ఆ వార్తల్లో నిజం లేదనీ, వీరి వివాహం రద్దవ్వలేదనీ తాజాగా అందుతోన్న సమాచారం. ఓ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా, విశాల్‌ తండ్రి పెళ్లి వార్తపై స్పందించారు. అన్నీ సక్రమంగా జరిగితే, అక్టోబర్‌ 9న వీరి వివాహం జరగాల్సి ఉంది. కానీ, జరగలేదు. అయితే, రద్దు మాత్రం కాలేదని తాజాగా విశాల్‌ తండ్రి ప్రముఖ నిర్మాత జీ.కె.రెడ్డి స్పష్టం చేశారు.

 

డేట్‌ ఫిక్స్‌ చేయలేదు. కానీ, త్వరలోనే విశాల్‌ వివాహం జరగనుందనీ ఆయన తెలిపారు. అంతేకాదు, నడిగర్‌ సంఘం భవన నిర్మాణం పూర్తి చేశాక, ఆ భవనంలోనే తన వివాహం చేసుకుంటానని గతంలోనే విశాల్‌ ప్రకటించారు. చాలాసార్లు అదే మాటను ప్రస్థావించారు కూడా. తాజాగా జీ.కె.రెడ్డి కూడా మరోసారి ఆ మాటను స్పష్టం చేశారు. అంటే, త్వరలోనే నడగర్‌ సంఘం భవనం పూర్తి కావడం, అదే భవనంలో విశాల్‌ పెళ్లి చేసుకోవడం జరుగుతాయన్న మాటే.

 

ఇకపోతే, ప్రస్తుతం విశాల్‌ తన సినిమాలతో బిజీగా ఉన్నాడు. విశాల్‌ నటించిన 'యాక్షన్‌' త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది ఈ సినిమాలో. రీసెంట్‌గా మరో సినిమాని విశాల్‌ పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. ఏది ఏమైతేనేం, సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగినట్లు విశాల్‌, అనీషా రెడ్డిల వివాహమైతే రద్దు కాలేదని కన్‌ఫామ్‌ అయ్యింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS