బిగ్‌బాస్‌లో రాహుల్ సిప్లిగంజ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అనిపించుకుంటున్నాడు. కానీ, తాజా ఎపిసోడ్‌లో భాగంగా బిగ్‌బాస్ ఇచ్చిన సోలో పర్‌ఫామెన్స్ టాస్క్‌లో భాగంగా, రాహుల్ తన సింగింగ్ టాలెంట్‌ని యూజ్ చేసి, 'ఏమైపోతావే..' రొమాంటిక్ సాంగ్ ఆలపించాడు. అయితే, ఎందుకో నెర్వెస్ ఫీలయి, సాంగ్ పర్‌ఫామెన్స్ మధ్యలోనే ఆపేసి, సారీ గైస్ గివ్‌అప్ అనేశాడు. జడ్జ్‌స్‌గా వ్యవహరించిన శ్రీముఖి, బాబా భాస్కర్‌లతో పాటు, మిగిలిన హౌస్ మేట్స్ అంతా రాహుల్‌ని మళ్లీ ట్రై చేయ్.. అన్నా కూడా రాహుల్ వినిపించుకోలేదు. జస్ట్ లీవ్ ఇట్ అని టాస్క్ వదిలేశాడు.
ఫిజికల్ టాస్క్‌లు ఎలాగూ గివ్‌అప్ చేస్తున్నావ్. నీ ప్రొఫిషనల్ అయిన సింగింగ్‌ని కూడా ఇలా గివ్‌అప్ చేయడం బాగోలేదు.. ఇలా చేయడం వల్ల బయట ఇన్‌ఫ్లూయెన్స్ మరోలా పడుతుంది నీ పైన అని శ్రీముఖి నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది. కానీ, రాహుల్ టేక్ సమ్ మోర్ టైమ్.. అని వెనక్కి వెళ్లిపోయాడు. కాస్త డిష్రబ్డ్‌గా అనిపించాడు. కానీ, కాసేపటి తర్వాత మళ్లీ పర్‌ఫామ్ చేసేందుకు ముందుకొచ్చాడు. ఈ సారి బెస్ట్ పర్‌ఫామెన్స్ ఇచ్చి, ఫీల్ ద ఫిజ్ ఛాన్స్ కొట్టేశాడు.
తన పర్‌ఫామెన్స్‌తో, రాహుల్ హౌస్‌మేట్స్‌తో పాటు, వీక్షకుల్ని కూడా రొమాంటిక్ మూడ్‌లోకి తీసుకెళ్లిపోయాడు. రవికృష్ణ సగం మగ, సగం ఆడ గెటప్‌తో వచ్చి, బెస్ట్ డాన్స్ పర్‌ఫామెన్స్ ఇచ్చి యో యో.. కెవ్వుకేక అనిపించాడు. పునర్నవి, ఆషూ రెడ్డి, డాన్స్ పర్‌ఫామెన్స్‌తో ఆకట్టుకున్నారు. హిమజ 'గురు'లోని 'ఓ సక్కనోడా..' సాంగ్‌కి తనదైన పర్‌ఫామెన్స్ ఇచ్చింది. సావిత్రక్క లాజిక్ లేని మ్యాజిక్‌తో నవ్వించింది.