ప్రముఖ కథానాయకుడు విశాల్ కి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన ధృవీకరించారు కూడా. తన తండ్రికీ, మేనేజర్కీ కరోనా ఉందని ప్రకటించారు. ''మా నాన్న కరోనాతో బాధ పడుతున్నారు. ఆయనకు సన్నిహితంగా ఉన్నందున నాలోనూ ఆ లక్షణాలు మొదలయ్యాయి. జ్వరం, జలుబు, వళ్లు నొప్పులూ ఉన్నాయి. ప్రస్తుతం ఆయుర్వేద మందులు వాడుతున్నాం. మరో వారం రోజుల్లో ఈ ప్రమాదం నుంచి బయటపడొచ్చు' అంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రకటించారు.
కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో సినీ పరిశ్రమ ఎలర్ట్ అయిపోయింది. షూటింగులకు వెళ్లడం లేదు. అసలు స్టార్లెవరూ బయటకు రావడం లేదు. అయినా ఏదో ఓ రూపంలో కరోనా వ్యాప్తి చెందుతోంది. స్టార్స్నీ వదలడం లేదు. ఆమధ్య బాలీవుడ్ స్టార్స్ అమితాబ్, అభిషేక్, ఐశ్వర్యలకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. వాళ్లంతా ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు విశాల్ వంతు వచ్చింది.