ఇంట్లోవాళ్లు వ‌ద్దంటున్నారు!

By Gowthami - June 23, 2020 - 11:00 AM IST

మరిన్ని వార్తలు

షూటింగుల‌కు అనుమ‌తి ఇచ్చినా - హీరోలు ఇళ్లు క‌ద‌ల‌డం లేదు. స్టార్ హీరోలైతే... నిర్మాత‌ల‌కు ముందే సంకేతాలు ఇచ్చేశారు.. ఇప్ప‌ట్లో షూటింగుల‌కు వచ్చేది లేద‌ని తేల్చేశారు. కొంత‌మంది హీరోలు.. షూటింగులకు రెడీ అవుతున్నా - ఇంట్లోవాళ్ల మంద‌లింపుల‌తో మ‌న‌సు మార్చుకుంటున్నార్ట‌. `షూటింగుల‌కు వెళ్లొద్దు` అని కుటుంబ స‌భ్యులు ప‌ట్టుబ‌డుతుండ‌డంతో క‌థానాయ‌కులు కూడా ఏమీ చేయ‌లేక‌పోతున్నార‌ని ఇన్‌సైడ్ వ‌ర్గాల టాక్‌.

 

ఇటీవ‌ల ఓ హీరో నిర్మాత‌ల‌కు ఫోన్ చేసి 'షూటింగుల‌కు నేను రెడీ... చేసేసుకుందాం' అని గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. నిర్మాత ఉత్సాహంగా షూటింగుకి ప్లాన్ చేసుకుంటే, అంత‌లోనే మ‌ళ్లీ... 'ఇప్పుడు వ‌ద్దులెండి.. ఇంట్లో అస‌లే చిన్న పిల్ల‌లున్నారు. ఈ టైమ్ లో నేను బ‌య‌ట‌కు రావ‌డం క‌రెక్ట్ కాదు..' అని స‌ర్ది చెప్పాడ‌ట‌. ఇంట్లో చిన్న పిల్ల‌లూ, వృద్ధులూ ఉంటే, క‌థానాయ‌కులు బ‌య‌ట‌కు రావ‌డానికి జంకుతున్నార‌ని, క‌రోనా వాళ్ల‌కు త్వ‌ర‌గా సోకే అవ‌కాశం ఉండ‌డ‌మే అందుకు కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. ఓ సీనియ‌ర్ హీరో సైతం ఇంట్లోవాళ్ల క‌ట్ట‌డి వ‌ల్లే.. త‌న సినిమా షూటింగుని నిలిపివేశాడ‌ని, ప్ర‌స్తుతం క‌థానాయ‌కులు.. సినిమాలు, సంపాద‌న మీద కంటే, ఆరోగ్య‌మే ముఖ్య‌మని భావిస్తున్నార‌ని, అందుకే షూటింగులు మొద‌లు కావ‌డం లేద‌ని ఓ నిర్మాత చెప్పుకొచ్చారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS