సినిమాలపై మూడ్ లేన‌ట్టేనా?

మరిన్ని వార్తలు

నాగ‌చైత‌న్య - స‌మంత పెళ్ల‌యి దాదాపు మూడేళ్లు కావొస్తోంది.పిల్ల‌ల విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కూ ప్లానింగ్ చేసుకోలేదు. అది వాళ్ల వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారం అనుకోండి. కానీ... స‌మంత ఎప్పుడు మీడియా ముందుకొచ్చినా ఈ ప్ర‌శ్న త‌ప్ప‌కుండా ఎదుర‌య్యేది. దానికి న‌వ్వుతూ స‌మాధానం దాటేసేది స‌మంత‌. అయితే.. ఇప్పుడు మాత్రం సీరియ‌స్‌గానే ఈ విష‌యంపై దృష్టి పెట్టిన‌ట్టు ఇన్‌సైడ్ వ‌ర్గాల టాక్‌. స‌మంత మాతృత్వంపై మ‌మ‌కారం పెంచుకుంద‌ని, ప్ర‌స్తుతం తల్లికావాల‌నే ఆలోచ‌న‌లో ఉంద‌ని, అందుకోసం కొంత‌కాలం సినిమాలకు దూర‌మ‌వ్వ‌డానికి నిర్ణ‌యం తీసుకుంద‌ని తెలుస్తోంది.

 

లాక్ డౌన్ వ‌ల్ల షూటింగులు ఆగిపోయాయి. కొత్త క‌థ‌లు విన‌డం గానీ, కొత్త సినిమాలు ఒప్పుకోవ‌డం గానీ చేయ‌డం లేదు. అంతే కాదు... ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు సైతం స‌మంత ట‌చ్‌లో లేద‌ని, పూర్తిగా వ్య‌క్తిగ‌త జీవితానికే స‌మ‌యం కేటాయిస్తోంద‌ని తెలుస్తోంది. సోనీ పిక్చ‌ర్స్‌తో స‌మంత ఓ సినిమా చేయ‌డానికి ఒప్పుకుంది. ఇది పాన్ ఇండియా ప్రాజెక్టు. ఈ సినిమా మొద‌ల‌వ్వ‌డానికి ఇంకా చాలా స‌మ‌యం ఉంద‌ట‌. ఇది మిన‌హా స‌మంత మ‌రో సినిమాపై సంత‌కం చేయ‌లేదు. 2021లో స‌మంత నుంచి మ‌రో సినిమా వ‌చ్చే ఛాన్స్ లేద‌ని, స‌మంత కొత్త సినిమాల్ని ఎంచుకోవాల‌న్నా, చేయాల‌న్నా, స‌మంత‌ని చూడాల‌న్నా 2022 వ‌ర‌కూ ఆగాల్సిందేన‌ని టాక్‌. క‌రోనా భ‌యాల‌తో షూటింగులు ఎలాగూ లేవు. సో.. మాతృత్వాన్ని ఆస్వాదించ‌డానికి ఇదే స‌రైన త‌రుణ‌మ‌ని స‌మంత భావించి ఉండొచ్చు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS