సినీ పరిశ్రమలో రెమ్యునరేషన్ల ‘కోత’ మొదలైందట.

మరిన్ని వార్తలు

కరోనా ఎఫెక్ట్‌ నేపథ్యంలో రెమ్యునరేషన్ల కోత తప్పదంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. ఇప్పుడు అది అమల్లోకి వచ్చేసిందనే గుసగుసలు విన్పిస్తున్నాయి. నిర్మాతల వైపు నుంచి ఒత్తిళ్ళు ఓ వైపు, స్వచ్ఛందంగా ముందుకొస్తున్న తారలు ఓ వైపు.. వెరసి ఇప్పుడు ఈ రెమ్యునరేషన్ల కోట వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న రెండు మూడు సినిమాల నిర్మాతలకు ఆయా చిత్రాల్లో నటిస్తోన్న స్టార్‌ హీరోలు, హీరోయిన్ల నుంచి స్వచ్ఛందంగానే తీపి కబురు అందిందట.

 

‘రెమ్యునరేషన్ల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు..’ అని ఆ సినిమాల్లో నటిస్తోన్న నటీనటులే సమాచారం అందించారట. ఇదిలా వుంటే, ఓ ప్రముఖ హీరోయిన్‌.. ఇటీవల వరుస సక్సెస్‌లతో తన రెమ్యునరేషన్‌ని అమాంతం పెంచేసింది. అయితే, ఆ రెండు సూపర్‌ హిట్స్‌కి ముందు తాను తీసుకున్న రెమ్యునరేషన్‌కే మళ్ళీ పరిమితమైపోవాలనే నిర్ణయానికి వచ్చిందట ఆ అందాల భామ. కాగా, ఓ ప్రముఖ హీరోయిన్‌ మాత్రం రెమ్యునరేషన్‌ విషయంలో తగ్గేదే లేదని చెబుతోందంటూ ఓ గాసిప్‌ బయటకొచ్చింది. ఏదిఏమైనా, ఇది కోరోనా కష్ట కాలం. ఈ కష్ట కాలంలో ప్రజల్ని ఆదుకునేందుకు, సినీ కార్మికుల్ని ఆదుకునేందుకు ముందుకొస్తున్న సినీ ప్రముఖులు.. తమ పరిశ్రమను ఆదుకునేందుకూ త్యాగాలు చేయక తప్పనిసరి. అది తమ రెమ్యునరేషన్‌ తగ్గింపుతో కూడా చేయొచ్చు.. చేస్తారు కూడా.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS