ప్రాచీక కళ మల్లకంబను ప్రోత్సహించడంలో ముద్దుగుమ్మ ఆదాశర్మ తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది. తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో తన ప్రావీణ్యాన్నంతా చాటుకుంది. చెట్టుకు వేలాడే పొడవాటి తాడు, ఆ తాడును ఆధారంగా చేసుకుని ప్రదర్శించే విన్యాసాలు ఒకింత గగుర్పాటుకు గురి చేస్తాయి. ఎందుకంటే ఏమాత్రం పట్టు తప్పినా, అంతే సంగతులు. ఒక్కోసారి తల కిందకీ, కాళ్లు పైకీ ఉంటాయి.
ఈ పరిస్థితుల్లో కింద పడితే ప్రాణం పోవడం ఖాయం. ఇలాంటి విద్య ప్రదర్శించాలంటే ఎంతో నేర్పు కావాలి. అది కావల్సినంత ఉంది ఆదాశర్మకి. కేవలం కాలి బొటనవేలుకు ఆ పక్కన ఉండే వేలుకు మధ్యలో తాడును ఉంచి మరో కాలితోనూ అదేలా తాడును పట్టుకుని ఆదాశర్మ చేసిన విన్యాసం అద్భుతం. ఇదొక్కటే కాదు, తాడును నడుముకు కట్టుకుని కొంత భాగాన్ని కాలికి చుట్టుకుని నిద్రావస్థలో నేలకు సమాంతరంగా ఉండడం మరో గొప్ప విషయం.
రండి నేనెలా నిద్రపోతానో చూడండి.. అని చెప్పి ఈ విన్యాసాన్ని చేసింది ఆదాశర్మ. కుటుంబ వారసత్వంగా తల్లి నుండి ఈ విద్యను నేర్చుకుంది ఆదాశర్మ. సోషల్ మీడియాలో సెలబ్రిటీలు హాట్ హాట్ ఫోటోలు మాత్రమే పనికొచ్చే విశేషాలు పోస్ట్ చేస్తూ జనాన్ని ఎడ్యుకేట్ చేస్తున్నారనడానికి ఇదొక ఎగ్జాంపుల్. హ్యాట్సాఫ్ టు ఆదాశర్మ.