మెగా హీరో కోసం మహేష్‌ హీరోయిన్‌.!

మరిన్ని వార్తలు

మెగా మేనల్లుడు 2 వైష్ణవ్‌ తేజ్‌ సినిమాలో ఐటెం సాంగ్‌ కోసం కృతిసనన్‌ని తీసుకురానున్నారట. మహేష్‌బాబుతో '1 - నేనొక్కడినే' సినిమాలో హీరోయిన్‌గా నటించిన కృతిసనన్‌ తర్వాత 'దోచేయ్‌'లో కనిపించింది. ఆ తర్వాత బాలీవుడ్‌కి చెక్కేసింది. ఇప్పుడు వైష్ణవ్‌తేజ్‌ కోసం మళ్లీ టాలీవుడ్‌కి రానుందనీ విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌. 

 

సుకుమార్‌ నిర్మాణ భాగస్వామ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాని ఇటీవలే లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. సుకుమార్‌ సినిమాల్లో స్పెషల్‌ సాంగ్స్‌కి ప్రత్యేకత ఉంటుంది. 'రంగస్థలం' కోసం పూజాహెగ్దేని తీసుకొచ్చిన సుకుమార్‌ ఈ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ కోసం కృతిసనన్‌తో సంప్రదింపులు చేస్తున్నారట. సుకుమార్‌ దగ్గర అసిస్టెంట్‌గా పని చేసిన బుచ్చిబాబు ఈ సినిమాకి దర్శకుడు. 

 

ఫస్ట్‌లుక్‌ ఫోటోతోనే ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్‌ చేసేసింది చిత్ర యూనిట్‌. వైష్ణవ్‌తేజ్‌ ఫిషర్‌ మ్యాన్‌ కుటుంబానికి చెందిన పల్లెటూరి యువకుడి పాత్రలో కనిపించనున్నాడీ సినిమాలో. 'రంగస్థలం' సినిమా కథకు కాస్త దగ్గరగా ఈ సినిమా కథ ఉండబోతోందనీ గుసగుసలు వినిపిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకి మ్యూజిక్‌ అందిస్తున్నాడు.. రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుంది. హీరోయిన్‌ వివరాలు ఇంకా వెల్లడి కావల్సి ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS