స్టార్ హీరోయిన్గా తెలుగు పరిశ్రమని కొన్నాళ్లు ఏకఛత్రాదిపత్యంగా ఏలేసిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్‌సింగ్ ఇప్పుడు టాలీవుడ్లో నిలదొక్కుకోవడానికి చేయని ప్రయత్నమంటూ లేదు. కానీ ఎందుకో టాలీవుడ్ రకుల్ విషయంలో కాస్త గట్టిగా ఆలోచించి అడుగులు వేస్తోంది. ఎట్టకేలకు బాలయ్యతో 'ఎన్టీఆర్ - కథానాయకుడు' చిత్రంలో 'అతిలోకసుందరి' శ్రీదేవి పాత్రలో కొన్ని నిముషాలు కనిపించి రీ ఎంట్రీ ఇచ్చేశాననిపించుకుంది రకుల్.
తర్వాత వెంకీ - చైతూ కాంబోలో తెరకెక్కుతోన్న 'వెంకీ మామ' చిత్రంలో చైతూకి జోడీగా ఎంపికైందని సమాచారమ్. లేటెస్టుగా బాలయ్యతోనే మరో ఛాన్స్ దక్కించుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే, తమిళంలో రకుల్ జోరు కాస్త ఫర్వాలేదనే చెప్పాలి. అన్నదమ్ములు సూర్య, కార్తిలతో వరుసగా జోడీ కడుతున్న రకుల్ లవర్స్‌డే సందర్భంగా డబుల్ ధమాకా ఇవ్వనుంది. సూర్య హీరోగా తెరకెక్కుతోన్న 'ఎన్జీకే' చిత్రం టీజర్ ఫిబ్రవరి 14న విడుదల కానుందని చిత్రయూనిట్ లేటెస్ట్గా ప్రకటించింది.
ఇదే రోజు సోదరుడు కార్తి హీరోగా 'దేవ్' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 'దేవ్'లో రకుల్ సోలో హీరోయిన్గా నటిస్తుంటే, 'ఎన్జీకే'లో రకుల్‌తో పాటు, సాయిపల్లవి నటిస్తోంది. ఈ రెండు సినిమాలూ తెలుగులో కూడా విడుదలవుతాయి. కాబట్టి రకుల్ తెలుగు ప్రేక్షకుల్ని ఈ విధంగా ఒకేరోజు అన్నదమ్ములిద్దరితోనూ కనిపించి లవర్స్‌డేకి తెలుగు ఆడియన్స్‌కి స్పెషల్ కిక్ ఇవ్వనుందన్నమాట.