సినిమాల్లో అవకాశాలేమో శూన్యం.. సోషల్ మీడియాలో అందాల ఆరబోత మాత్రం ఘనం. శర్మ సిస్టర్స్, అదేనండీ 'చిరుత' ఫేం నేహా శర్మ ఆమె చెల్లెలు ఐషా శర్మల పరిస్థితి ఇదే. నేహా శర్మ కాస్త బెటర్, అప్పుడప్పుడూ అలా అలా బాలీవుడ్ సినిమాల్లో మెరుస్తూ వస్తోంది. అక్క చాటు చెల్లెలిగా బాలీవుడ్‌లో ఎంట్రీ అయితే ఇచ్చినా, అవకాశాలు దక్కించుకోవడంలో వెనకబడిపోయింది ఐషా శర్మ.
అందం అడవికాచిన వెన్నెల అయిపోకూడదనుకుంటోన్న ఈ భామ, సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఇదిగో, ఇలాంటి ఫొటోలు పోస్ట్ చేస్తూ, 'బ్రా'బోయ్.. అనిపించేస్తుంటుంది అభిమానులతో. తాజాగా ఐషా శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన ఈ ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది.
చక్కనమ్మ చూపిస్తానంటే సంబరపడకుండా వుంటుందా కుర్రకారు? 'బ్రా'బోయ్.. అంటూనే, ఆమె అందం చూసి లొట్టలేసేసుకుంటున్నారు. అలా కుర్రాళ్ళకు కిర్రాకు పుట్టించడానికే ఐషా శర్మ ఇంత కష్టపడుతున్నది. సర్లేగానీ, ఈ అందం ఆమెకు అవకాశాల్ని తెచ్చిపెడుతుందా? ప్రయత్నమైతే చేస్తోందిగానీ, ఫలితమే సరిగ్గా రావడంలేదు.