రామరాజు లుక్‌ రివీల్‌ చేసిన సీత.!

మరిన్ని వార్తలు

'వినయ విధేయ రామ' చిత్రంలో రామ్‌ చరణ్‌, కైరా అద్వానీ జంటగా నటించారు. ఈ సినిమాలో వీరిద్దరి పేర్లూ, రామ, సీత అన్న సంగతి తెలిసిందే. సినిమా హిట్‌ అవ్వలేదు కానీ, 'రామ లవ్స్‌ సీత.. సీత లవ్స్‌ రామ..' అంటూ ఫుల్‌ కెమిస్ట్రీతో ఈ సినిమాలో పాట కూడా వేసేసుకున్నారు వీరిద్దరూ. వీరిద్దరి సినిమా స్నేహం ఇంత గొప్పది కాబట్టే, తాజాగా జరిగిన కైరా అద్వానీ బర్త్‌డే వేడుకల్లో రామ్‌చరణ్‌ పాల్గొన్నాడు.

రామ్‌ చరణ్‌ ప్రస్తుతం 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో యంగ్‌ అల్లూరి సీతారామరాజుగా చరణ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. అందుకోసం డిఫరెంట్‌ స్టైల్‌ ఆఫ్‌ మీసకట్టును చరణ్‌ ఫాలో అవుతున్నాడు. అయితే, ఇంతవరకూ ఈ లుక్‌ ఎక్కడా రివీల్‌ కాలేదు. కానీ, సీత కైరా అద్వానీ పుణ్యమా అని, చరణ్‌ తాజా లుక్స్‌ బయటికొచ్చేశాయి. చరణ్‌, కైరా కలిసి సరదాగా దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో స్వైర విహారం చేస్తున్నాయి.

ఈ ఫోటోల్లో రామ్‌చరణ్‌ మీసం, బాడీ లాంగ్వేజ్‌ సింప్లీ సూపర్బ్‌. యంగ్‌ అల్లూరి ఇలాగే ఉంటాడా.? అని ఫ్యాన్స్‌ తెగ సరబరపడిపోతున్నారు. అయితే, నిజానికి చరణ్‌ ఈ లుక్‌లో ఎప్పుడో కనిపించేశాడు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' గురించి అన్ని విషయాల్నీ క్లారిటీ ఇచ్చే క్రమంలో రాజమౌళి పెట్టిన ప్రెస్‌ మీట్‌లో భాగంగా చరణ్‌, ఎన్టీఆర్‌ సమ్‌థింగ్‌ డిఫరెంట్‌ లుక్స్‌తో ఆకట్టుకున్నారు. అప్పుడు చరణ్‌ ఇదే స్టైల్‌ మీసంతో కనిపించాడు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS