మహేష్‌బాబు సినిమాలో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇక్కడ ఓ ఇంట్రెస్టింగ్ మౌత్ టాక్ ఒకటి సర్క్యులేట్ అవుతోంది. విజయశాంతి బర్త్‌డే సందర్భంగా ఆమెకు పలువురు సినీ ప్రముఖులు బర్త్‌డే విషెస్ చెప్పారు. సినిమాల్లోకి గ్రాండ్‌గా రీ వెల్‌కమ్ చెప్పారు. ఈ క్రమంలో మహేష్‌బాబు కూడా విజయశాంతికి బర్త్‌డే విషెస్ చెప్పారు. ఆ విషెస్‌లో మహేష్‌బాబు 'హ్యాపీ బర్త్ డే విజయశాంతి గారు..' అని సంబోధించారు. ఇది కామనే కదా.. ఇందులో ఏం విషయముంది అనుకుంటున్నారా.? అసలు విషయం వేరే ఉంది.
మహేష్‌బాబుకు రిప్లై ఇస్తూ, విజయశాంతి కూడా 'థాంక్యూ మహేష్ గారూ..' అని సంబోధించింది. ఇక్కడే అసలు విషయముంది. మహేష్, విజయశాంతిని 'గారు' అని సంబోధించడం బాగానే ఉంది కానీ, విజయశాంతి తిరిగి 'మహేష్‌గారు' అని సంబోధించడం ఆశ్యర్యం కలిగిస్తోంది. వాస్తవానికి విజయశాంతి, మహేష్‌బాబు గతంలో ఓ సినిమాలో నటించారు. అదే 'కొడుకు దిద్దిన కాపురం'.
అప్పుడు విజయశాంతి, మహేష్‌కి తల్లి పాత్రలో నటించింది. కొడుకు వయసున్న మహేష్‌ని గారు అని సంబోధించడమే ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సూపర్ స్టార్ అని కూడా తన రిప్లైలో మెన్షన్ చేసింది విజయశాంతి. అయితే, ప్రస్తుతం మహేష్ స్టార్‌డమ్‌కి విజయశాంతి ఈ విధంగా రెస్పెక్ట్ ఇచ్చిందనుకోవాలేమో. అంతేకాదు, రీ ఎంట్రీలో సూపర్‌స్టార్‌తో తన తొలి సినిమా చాలా ఆనందంగా ఉందని విజయశాంతి పేర్కొన్నారు.