పవన్ అసలైన రాజకీయం - జనసేనలోకి వంగవీటి!

By iQlikMovies - June 24, 2019 - 18:00 PM IST

మరిన్ని వార్తలు

ఆంధ్ర ప్రదేశ్ లో అటు వైసీపీ ఇటు టిడిపి మధ్య మూడవ శక్తిగా అవతరించి అశేషమైన జనాధారణతో అందరిని ఆశ్చర్యపరిచిన జనసేన పార్టీ, 2019 ఎన్నికల్లో ఊహించని విధంగా ఘోర పరాజయం దక్కించుకుంది. ఎన్నికల ఫలితాలు విడుదలైన కొద్దీ రోజుల వరకు పెద్దగా మీడియా ముందుకు రాని జనసేనాని పవన్ కళ్యాణ్, జూన్ 8న జనసేన కార్యకర్తలు మరియు మీడియా మిత్రులతో మాట్లాడారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ తన పోరాటం ఎన్నటికీ ఆగదని..'ఇప్పటి వరకు నా సిద్ధాంతాలనే చూసారు..ఇక పై నా రాజకీయం చూస్తారు' అని కొన్ని ఘాటైన స్టేట్మెంట్స్ ఇచ్చి కార్యకర్తల్లో ఉతేజాన్ని నింపారు.

 

ఇకపోతే ఇటు కాపు సామాజిక వర్గం అటు బడుగు బలహీన వర్గాల్లో తనకంటూ ప్రత్యేక క్రేజ్ ఉన్న 'వంగవీటి రాధ' నేడు పవన్ ని కలుసుకున్నట్టు తెలిసింది. త్వరలోనే జనసేనలో అధికారికంగా చేరనున్నట్టు కార్యకర్తల్లో వినిపిస్తున్న వార్త. ఇదే జరిగితే జనసేనకి మంచి బలం చేకూరినట్టే, కార్యకర్తలకూ నూతన ఉత్సాహం తోడైనట్టే. అంతే కాకుండా జనసేన గ్రామ మరియు మండల స్థాయి కమిటీలు కూడా త్వరలోనే మొదలవుతాయని, పార్టీ కి సంబంధించి కీలకమైన బాధ్యతలు జెడి లక్ష్మి నారాయణ చేపడతారని పార్టీ పెద్దలు చెప్పుకుంటున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS