టాలీవుడ్‌లో తెలుగమ్మాయ్‌ పుంజుకుంటోందా.?

మరిన్ని వార్తలు

తెలుగమ్మాయ్‌ అంజలి టాలీవుడ్‌లో పుంజుకుంటోందనిపిస్తోంది. ప్రస్తుతం రెండు తెలుగు సినిమాలు అంజలి చేతిలో ఉన్నాయి. అందులో ఒకటి పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్‌ సాబ్‌’ కాగా, మరో మూవీ అనుష్క ‘నిశ్శబ్ధం’. రెండు సినిమాల్లోనూ అంజలికి స్కోపున్న పాత్రలే దక్కాయంటున్నారు. ‘నిశ్శబ్ధం’ ట్రైలర్‌లో అంజలి నట విశ్వరూపం చూపించబోతోందని ట్రైలర్‌ ద్వారా అర్ధమవుతోంది. ఇంతకు ముందెన్నడూ కనిపించని విధంగా పవర్‌ ఫుల్‌ పోలీసాఫీసర్‌ పాత్ర లో అంజలి కనిపిస్తోంది ఈ మూవీలో. కనిపించింది కాసేపే అయినా, తన అప్పియరెన్స్‌, పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌తో ఆకట్టుకుంది ట్రైలర్‌లో.

 

ట్రైలర్‌లోనే ఇలా ఉంటే, సినిమాలో అంజలి పాత్రకు ఇంకెంత ఇంపార్టెన్స్‌ ఉండబోతోందో అనిపిస్తోంది. ఈ రెండు సినిమాలు మంచి అంచనాలున్న సినిమాలే. సో అంజలికి ఖచ్చితంగా కలిసొచ్చేవే. అన్నట్లు అంజలి లిస్ట్‌లో మరో మూవీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బాలయ్య ` బోయపాటి సినిమాలోనూ అంజలి పేరు వినిపిస్తోంది. ఒకవేళ ఇదీ నిజమే అయితే, టాలీవుడ్‌లో హీరోయిన్స్‌ కొరత అంజలి పాపకు బాగా కలిసొచ్చిందనిపిస్తోంది. హీరోయిన్స్‌ కొరత వల్లే టాలీవుడ్‌ అంజలి వైపు చూస్తోందేమో. ఏది ఏమైతేనేం, అందిన సిట్యువేషన్‌ క్యాష్‌ చేసుకుంటే, అంజలి కెరీర్‌ టాలీవుడ్‌లో టర్న్‌ అయినట్లే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS