బాలీవుడ్ ప్ర‌య‌త్నాల్లో చ‌ర‌ణ్‌?

మరిన్ని వార్తలు

జంజీర్‌తో బాలీవుడ్ వెళ్లాడు రామ్ చ‌ర‌ణ్‌. ఆ సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యింది. మ‌ళ్లీ అలాంటి ప్ర‌య‌త్నం చేయ‌కూడ‌ద‌న్న నిజాన్ని గ్ర‌హించాడు చ‌ర‌ణ్‌. ఇప్పుడు బుద్ధిగా తెలుగు సినిమాల‌పై దృష్టి పెట్టాడు. అయితే చ‌ర‌ణ్‌కి మ‌రోసారి హిందీ సినిమా చేయాల‌న్న ఆలోచ‌న క‌లిగింద‌ట‌. ప్ర‌స్తుతం అదే ప్ర‌య‌త్నాల్లో ఉన్న‌ట్టు టాలీవుడ్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. రంగ‌స్థ‌లం సూప‌ర్ హిట్ట‌వ్వ‌డంతో తెలుగులో చ‌ర‌ణ్ క్రేజ్‌, రేంజ్ అమాంతంగా పెరిగిపోయాయి. విన‌య విధేయ రామా ఫ్లాప్ అయినా - ఆ సినిమాకి క‌ళ్లు చెదిరే ఓపెనింగ్స్ వ‌చ్చాడు. ఇప్పుడ 'ఆర్‌.ఆర్‌.ఆర్‌'లో న‌టిస్తున్నాడు. ఇది రాజ‌మౌళి సినిమా.

 

అందుకే ఇది కూడా సూప‌ర్ డూప‌ర్ హిట్ అనే న‌మ్మ‌కం అప్పుడే వ‌చ్చేసింది. 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' త‌ర‌వాత ఎలాంటి సినిమాలు చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నాడు చ‌ర‌ణ్‌. త‌ప్ప‌కుండా రాజ‌మౌళి సినిమాతో త‌న‌కు పాన్ ఇండియా గుర్తింపు రావ‌డం ఖాయ‌మ‌ని న‌మ్ముతున్నాడు. త‌దుప‌రి సినిమాలు కూడా అదే స్థాయిలో ఉండాల‌ని ప్లాన్ చేస్తున్నాడు.

 

రాజ‌మౌళి సినిమా అయిన వెంట‌నే ఓ హిందీ సినిమా చేస్తే బాగుంటుంద‌న్న ఆలోచ‌న‌లో ఉన్నాడు చ‌ర‌ణ్‌. అందుకోసం ఇప్ప‌టి నుంచే క‌థ‌లు వింటున్నాడట‌. బాలీవుడ్‌తో స‌హా, అన్ని భాష‌ల్లోనూ వ‌ర్క‌వుట్ అయ్యే ఓ క‌థ ఇప్పుడు చ‌ర‌ణ్ ద‌గ్గ‌ర సిద్ధంగా ఉంద‌ని, 'ఆర్‌.ఆర్‌.ఆర్' త‌ర‌వాత చ‌ర‌ణ్ చేయ‌బోయే సినిమా అదే అని, ఈ సినిమాకి ఓ కొత్త కుర్రాడు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాడ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌రి.. ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌రు, ఆ క్రేజీ ప్రాజెక్టు ఎలా ఉండ‌బోతోంది? అనే విష‌యాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS