బాలకృష్ణ సినిమా అనగానే హీరోయిన్లు దొరకడం కష్టమైపోతోంది. పైగా బోయపాటి శ్రీను సినిమాకి ఈ సమస్య మరింత జటిలంగా ఉంది. స్టార్ హీరోయిన్లకు పెద్ద పెద్ద పారితోషికాలు ఇచ్చి తీసుకురావడం నిర్మాతలకు ఇష్టం లేదు. కొత్త వాళ్లని చూద్దామంటే బాలయ్య పక్కన ఎవరూ సెట్ అవ్వడం లేదు. ఒకవేళ ఎంపిక చేసినా.. వాళ్లు హ్యాండ్ ఇచ్చి మెల్లగా జారుకుంటున్నారు.
మలయాళ కుట్టీ ప్రయాగ మార్టిన్‌ని బాలయ్య సరసన ఎంపిక చేస్తే... ఆమె ఒకట్రెండు రోజులు షూటింగ్ కి వచ్చి `బై` చెప్పేసి వెళ్లిపోయింది. ఆ తరవాత... సాయేషా సైగల్‌ని తీసుకున్నారు. ఇప్పుడు తాను కూడా హ్యాండ్ ఇచ్చినట్టు టాక్. సాయేషా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు ఆమె స్థానంలోనే ప్రగ్యా జైస్వాల్ ని ఎంచుకున్నట్టు వార్తలొస్తున్నాయి. మరోకథానాయికగా పూర్ణని ఎంచుకున్న సంగతి తెలిసిందే. పూర్ణ ఎప్పుడో ఫేడవుట్ అయిపోయింది. అయినా సరే, పూర్ణని తీసుకున్నారంటే, బాలయ్య కు హీరోయిన్ల కొరత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవొచ్చు,. ఇప్పుడు ప్రగ్యా అయినా ఉంటుందా? రెండ్రోజుల తరవాత.. మరో హీరోయిన్‌ని చూసుకోమంటుందా? వెయిట్ అండ్ సీ.