90 దశకంలో తెలుగు చిత్రాల్లో ఓ మోస్తరుగా రాణించిన కథానాయిక కస్తూరి. అగ్ర కథానాయకులతో పనిచేసినప్పికీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ అక్కసుతోనో ఏమో.. ఓ టాలీవుడ్ హీరోపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తెలుగులో ఓ అగ్ర కథానాయకుడితో పనిచేశానని, ఆ హీరో తనని శారీరకంగా వాడుకోవాలని చూశాడని, పడగ్గదికి పిలిచేవాడని, కానీ తాను `నో` చెప్పానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది కస్తూరి. ఆ అక్కసుతో ఆ హీరో..సెట్లో తనపై చాలా దురుసుగా ప్రవర్తించేవాడని, తన తదుపరి సినిమాల్లో తనకు ఛాన్స్ రాకుండా చూశాడని ఘాటైన వ్యాఖ్యలే చేసింది. ఆ హీరో ఇప్పుడు రాజకీయాలతో బిజీగా ఉన్నాడని ఓ క్లూ ఇచ్చింది. దాంతో కస్తూరితో ఓ సినిమా చేసి, ఇప్పుడు రాజకీయాలతో బిజీగ ఆన్నది ఎవరంటూ... టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఆ జాబితాలో ఇద్దరు హీరోలు కనిపిస్తున్నారు. మరి కస్తూరిని ఇబ్బంది పెట్టింది ఎవరో వాళ్లకే తెలియాలి.