హీరోయిన్లు చాలా మంది సినిమాల్లో సత్తా చాటిన తర్వాత రాజకీయాలపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. అలా చాలా మంది ముద్దుగుమ్మలు రాజకీయాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అదే కోవలో ఇప్పుడు మరో హీరోయిన్ రాజకీయాల్లో తన సత్తా చాటాలనుకుంటోంది. ఆమె ఎవరో కాదు, 'అన్నమయ్య' సినిమాలో రమ్యకృష్ణతో పాటు నాగార్జునకి మరో మరదలుగా నటించిన ముద్దుగుమ్మ కస్తూరి. కస్తూరి రాజకీయ రంగ ప్రవేశం గురించి చాలా కాలంగా డిస్కర్షన్స్ జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడే ఇదిగో అదిగో అంటూ ఆమె పొలిటికల్ ఎంట్రీపై న్యూస్ వస్తూనే ఉన్నాయి. అయితే అందుకు ఇప్పుడు రంగం సిద్ధమైపోయినట్లే అనిపిస్తోంది. తెలుగు, తమిళంలో హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించింది కస్తూరి. కానీ హీరోయిన్‌గా అంతగా గుర్తింపు పొందలేకపోయింది. ప్రస్తుత తమిళ రాజకీయాలు కీలకంగా మారాయి. అందుకు కారణం రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ. ఆయన పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు బ్యాక్ గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నారన్న సంగతి తెలిసిందే. ఓ ప్రత్యేక పార్టీ ద్వారా రజనీ తన పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేయనున్నారనీ వార్తలు వస్తున్నాయి. ఈ సంగతి పక్కన పెడితే, కస్తూరి రజనీకాంత్‌కి సపోర్ట్‌గా మాట్లాడడం వెనుక పెద్ద ప్లానింగ్ ఉందంటూ సోషల్ మీడియా గుప్పుమంటోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని మార్చేందుకే రజనీ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ కస్తూరి చేసిన ప్రకటన బట్టి చూస్తుంటే, ఆమె ఒకవేళ రజనీకాంత్ కొత్తగా పెట్టబోయే పార్టీలో కీలక పాత్ర పోషించనుందా? అని భావించక తప్పడం లేదు. మొత్తానికి కస్తూరి పొలిటికల్ ఎంట్రీపై సస్పెన్స్ త్వరలోనే వీడనుందని తెలుస్తోంది.