ఈ మధ్య మాజీ హీరోయిన్ లైలాతో కలిసి బాలయ్య దిగిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా లైలా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాల్ని పంచుకుంది. ముందుగా బాలయ్యను ఐరన్‌మ్యాన్‌తో పోల్చింది. అప్పుడెప్పుడో బాలయ్యతో 'పవిత్ర ప్రేమ' సినిమాలో హీరోయిన్‌గా నటించిన లైలా, ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ఆయన్ని కలుసుకోవడం, అది కూడా ఓ డిఫరెంట్ గెటప్‌లో ఆయన్ని చూడడం చాలా సంతోషంగా ఉందని చెప్పింది. ఆయన్ని ఆ గెటప్‌లో చూస్తే ఐరన్ మ్యాన్ టోనీ స్టార్క్ గుర్తొచ్చారని చెప్పింది.
అంతేకాదు, త్వరలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నానని చెప్పింది అందాల లైలా. ఆల్రెడీ ఓ బైలింగ్వల్ మూవీలో నటిస్తోందట. త్వరలోనే తెలుగు సినిమాల్లో కూడా కనిపించనుందట. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయట. ఆ వివరాలు త్వరలోనే చెబుతానంటోంది లైలా. తనకు ఇష్టమైన హీరోయిన్ ఎవరంటే మీనా అని చెప్పింది.
మీనా అందరితోనూ చాలా క్లోజ్‌గా ఉంటుందనీ అందుకే ఆమె అంటే తనకెంతో ఇష్టమనీ లైలా చెప్పింది. ఇకపోతే, సెకండ్ ఇన్నింగ్స్‌లో ప్రాధాన్యత ఉన్న పాత్రలను ప్రిఫర్ చేస్తానంటోంది. హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ అయితే ఇంకా బాగుంటుందని తన మనసులో మాట చెప్పింది లైలా. అంటే, లైలా కోసం హీరోయిన్ సెంట్రిక్ కథల్ని సిద్ధం చేయాలన్న మాట మన దర్శకులు.