అప్పటి వెంకీ మరదలు ఇప్పుడు మళ్లీ వస్తోంది.!

మరిన్ని వార్తలు

'లైలా లైలా లైలా.. నచ్చావే మరదలు పిల్లా..' అంటూ ఓ సినిమాలో వెంకీ పాటేస్కున్నాడు గుర్తుందా.! ఆ పాటలో వెంకటేష్‌ పక్కన హాట్‌ హాట్‌గా స్టెప్పులేసిన క్యూట్‌ భామ గుర్తొచ్చిందా. ముద్దుగుమ్మ లైలా. 

'పెళ్లి చేసుకుందాం రా' చిత్రంలో వెంకీకి మరదలుగా నటించింది. శ్రీకాంత్‌ హీరోగా వచ్చిన 'ఎగిరే పావురమా' హీరోయిన్‌గా లైలాకి కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. క్యూట్‌ అండ్‌ బబ్లీగా కనిపించే లైలా అప్పట్లో పలు కమర్షియల్‌ హిట్స్‌ని తన ఖాతాలో వేసుకుంది. అయితే గత కొంతకాలంగా లైలా సినిమాల్లో కనిపించడం లేదు. ఓ బిజినెస్‌మేన్‌ని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితాన్ని హాయిగా ఎంజాయ్‌ చేస్తోంది. మళ్లీ లైలా ముఖానికి రంగేస్కోవాలనుకుంటుందట. 

ఈ మధ్య ఓ ఇంటర్య్వూలో తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ గురించి మనసులో మాట బయట పెట్టింది. త్వరలోనే మంచి కథ దొరికితే తెలుగు ప్రేక్షకుల్ని తన నటనతో ఆకట్టుకునేందుకు వచ్చేస్తాను సిద్ధంగా ఉండండని సంకేతాలు పంపిస్తోంది. ఇప్పటికే పలువురు సీనియర్‌ హీరోయిన్లు సెకండ్‌ ఇన్నింగ్స్‌లో మంచి మంచి అవకాశాలు దక్కించుకుంటూ బిజీగా గడుపుతున్నారు. 

అలాగే లైలా ఏ సినిమాతో తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేస్తుందో. ఆమె కోసం మన దర్శక, నిర్మాతలు ఎలాంటి పాత్రలను ప్రిపేర్‌ చేయనున్నారో. అసలింతకీ లైలా ఎలాంటి పాత్రలను ఎంచుకోనుందో తెలియాలంటే మరికొంత టైం వెయిట్‌ చేయాల్సిందే.!

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS