నగరి ఎం.ఎల్.ఏ రోజాకు మంత్రి పదవి వరించింది. ఏపీ కొత్త క్యాబినేట్ లో రోజాకి చోటు దక్కింది. మంత్రి రోజా.. అనిపించుకోవాలని ఎన్నాళ్ల నుంచో రోజా కోరిక. అసలు జగన్ ముఖ్యమంత్రి అవ్వగానే.. ఆమెకు మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరిగింది.కానీ సమీకరణాలు కుదరల్లేదు. ఇప్పుడు కొత్త క్యాబినెట్ లో కూడా రోజాకు మంత్రి పదవి దక్కదనే అనుకున్నారంతా. కానీ అనూహ్యంగా రోజాకు చోటు లభించింది. పార్టీ కోసం.. ముందు నుంచీ గట్టిగా ప్రచారం చేయడం, జగన్‌కి అత్యంత సన్నిహితురాలిగా మెలగడం, సినీ గ్లామర్ రోజాకు కలిసొచ్చాయి.
అయితే... మంత్రి పదవి దక్కించుకున్న తరవాత.. రోజా `జబర్‌దస్త్`కి దూరం కావడం తథ్యం. ఎందుకంటే.. ఎం.ఎల్.ఏగా ఉండి అలాంటి కార్యక్రమాలకు జడ్జ్‌గా ఉండడం ఏమిటని చాలామంది రోజాని విమర్శించారు. రోజా అప్పట్లో పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అది ఏమాత్రం కుదరదు. మంత్రి పదవి అంటే బాధ్యతలెక్కువ. ఇలా... షోలూ, టీవీలూ అంటూ తిరిగితే కుదరని పని. పైగా ప్రతిపక్షాలకు జుత్తు అందించినట్టు అవుతుంది.కాబట్టి.. ఇక నుంచి రోజా బుల్లి తెరపై కనిపించకపోవొచ్చు.