ఆది పురుష్ దర్శక నిర్మాతలపై ప్రభాస్ ఫ్యాన్స్ ముందు నుంచీ గుర్రుగానే ఉన్నారు. ఈ సినిమా నుంచి అప్ డేట్లు, లుక్కులు సరిగా రావడం లేదు. కీలకమైన పండగల సమయంలోనూ.. లుక్స్ రిలీజ్ చేయడం లేదు. ఆది పురుష్‌లో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
శ్రీరామ నవమి సందర్భంగా ఈసినిమా నుంచి ప్రభాస్ లుక్ బయటకు వస్తుందని వేయి కళ్లతో ఎదురుచూశారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. దర్శకుడు ఓం రౌత్ కూడా `శ్రీరామ నవమికి సర్‌ప్రైజ్` అని చెప్పేసరికి అది ఫస్ట్ లుక్కే అనుకున్నారు. తీరా చూస్తే.. ఓం రౌత్ ఓ వీడియో విడుదల చేశాడు. ఫ్యాన్ మేడ్ పోస్టర్లన్నీ కలిపి రూపొందించిన వీడియో అది చూసి ప్రభాస్ ఫ్యాన్స్ మరోసారి హర్టయిపోయారు. `ఫ్యాన్ మేడ్ పోస్టర్లన్నీ పెట్టి.. సర్‌ప్రైజ్ అంటే ఎలా` అంటూ మండి పడుతున్నారు. శ్రీరామనవమికి కూడా లుక్ రాకపోవడం ఏమిటని నిలదీస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. అయినా సరే... లుక్ ఇవ్వకపోవడం నిరాశ పరిచే విషయమే. 2023 జనవరి 12న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే.