'ఒక లైలా కోసం' చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే. ఆ సినిమాతో పర్వాలేదనిపించింది కానీ, పూజ కెరీర్ కు మాత్రం ఆ సినిమా పెద్దగా ఉపయోగపడలేదు. ఆ తరువాత 'ముకుంద'లో నటించినా అది పరాజయమైంది. అయినా... వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ప్రస్తుతం టాలీవుడ్లో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోయిన్లలో పూజా హెగ్డేనే ఫస్ట్ ప్లేస్ లో ఉంది.
పూజ ఖాతాలో వరుసగా 'అరవింద సమేత, మహర్షి' రీసెంట్ గా 'గద్దలకొండ గణేష్' లాంటి విజయాలున్నాయి. దీంతో అమ్మడికి డిమాండ్ బాగా పెరిగింది. స్టార్ హీరోలతో సినిమాలు చేయాలనుకునే హీరోలంతా పూజా వైపే చూస్తున్నారు. దీంతో పూజా రెమ్యూనరేషన్ రెట్టింపు చేసినట్టు తెలుస్తోంది. సుమారు రూ.2 కోట్ల వరకు డిమాండ్ చేస్తోందట. అందుకే ఆమెకు ఈ మధ్య కాస్త ఆఫర్లు తగ్గాయనీ.. అయినా పూజ మాత్రం డబ్బుల విషయంలో అసలు తగ్గట్లేదని తెలుస్తుంది. మొత్తానికి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఫార్ములాను పూజా పక్కాగా ఫాలో అవుతోందన్నమాట.
ఇకపోతే ప్రస్తుతం ఆమె చేతిలో ప్రభాస్ చేస్తున్న 'జాన్', అల్లు అర్జున్ తో నటిస్తున్న 'అలా వైకుంఠపురంలో', అఖిల్ - బొమ్మరిల్లు భాస్కర్ చిత్రాలున్నాయి. ఇవ్వన్నీ సూపర్ క్రేజ్ ఉన్న సినిమాలే. ఇవి గనుక హిట్టైతే రూ.2 కోట్లు కాస్త రూ.3 కోట్లకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏమైనా పూజా హెగ్డే ఇలా రెమ్యూనరేషన్ గురించి తరుచూ వార్తలెక్కితే ఆమె కెరీర్ కి అది మైనసే.