'ఆర్ఆర్ఆర్'లోనే ఇంట్రస్టింగ్ సీక్వెన్స్ అదే!

మరిన్ని వార్తలు

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న భారీ మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్'. ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజులా, తారక్ కొమరం భీంలా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా ఇప్పటికే 75% షూట్ పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమాలో తారక్ - చరణ్ మొదటి సారి కలుసుకునే సన్నివేశాలను రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

 

కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ ఓ వీరోచిత పోరాటాన్ని ప్రదర్శిస్తోన్న సందర్భంలో..రామ్ చరణ్ తనను చూస్తాడట. అలా భీంని చూసి రాజు అతని పట్ల అమితమైన గౌరవాన్ని పెంచుకుంటాడట. సినిమాలోనే ఈ సీక్వెన్స్ ఇంట్రస్టింగ్ సీక్వెన్స్ అట 'బాహుబలి' సిరీస్ తర్వాత జక్కన్న నుండి వస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమా పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ సరసన ఇద్దరూ హీరోయిన్స్ నటిస్తున్నారు.

 

ఇప్పటికీ మొదటి హీరోయిన్ గా ఓ విదేశీ భామ 'ఒలివియా మోరిస్' నటించనుంది. అలాగే రెండో హీరోయిన్ పాత్ర కూడా ఉందట. సినిమాలో ఓ గిరిజన యువతి ఎన్టీఆర్ పాత్రను ప్రేమిస్తోందట. ఆ పాత్రలోనే ఓ బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకోనున్నారని తెలుస్తోంది. మరి ఆ హీరోయిన్ ఎవరో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఎదురుచూడాల్సిందే. కాగా ఈ సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. జులై 30, 2020 లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS