రాశీ గుర్తుంది కదా? గోకులంలో సీత, శుభాకాంక్షలు, ప్రేయసిరావే చిత్రాలతో అలరించిన తార. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రల కోసం ఎదురు చూస్తోంది. బాల నటి గా చేస్తున్నప్పటి నుంచీ.. రాశీ సుపరిచితమే. అప్పట్లోనే బొద్దుగా ఉండేది. తన శరీరాకృతిని ఏమాత్రం కంట్రోల్ చేసుకునేది కాదు. అదే తన అందం అనుకోండి. తనకు పెళ్లైంది. ఇప్పుడు మరింత లావుగా తయారవ్వాలి. కానీ.. అదేంటో షాకింగ్ గా.. నాజూగ్గా మారిపోయింది. తన బరువులో సగానికి సగం తగ్గి, స్లిమ్ గా మారింది.
రాశీ కొత్త లుక్ చూసి, అంతా షాక్ కి గురవుతున్నారు. రాశీ ఈమధ్య టాలీవుడ్ అవకాశాల కోసం తెగ ప్రయత్నిస్తోంది. బొద్దుగా ఉంటే అవకాశాలు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకే బాగా తగ్గింది. లాక్ డౌన్‌సమయంలో తన శరీరాకృతిపై దృష్టి పెట్టింది. ప్రత్యేకమైన కసరత్తులు చేసింది. అందుకే ఇంత మార్పు. రాశీని ఇప్పుడు చూస్తే.. ఎవరైనా హీరోయిన్‌గా అవకాశాలు ఇవ్వాల్సిందే. ఆ స్థాయిలో తయారైంది రాశీ. తన కొత్త ఇన్నింగ్స్‌కి ఇది శ్రీకారం ఏమో..?