పుష్పలో సమంత ఐటెమ్ సాంగ్ చేస్తోందనగానే అంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే సమంత అప్పటి వరకూ ఐటెమ్ సాంగ్ చేయలేదు. మరోవైపు.. తన వ్యక్తిగత జీవితం పూర్తిగా ఇబ్బందుల్లో ఉన్న సమయం అది. అలాంటప్పుడు ఐటెమ్ పాట చేయడం ఏమిటి? అది నిజమేనా? అని అంతా అనుమానపడ్డారు. కానీ వాటిని పటాపంచలు చేస్తూ `ఊ అంటావా..` అనే పాటతో చెలరేగిపోయింది. ఆ పాట సమంతకు బాగా బూస్టప్ అయ్యింది. సమంతని ఐటెమ్ గాళ్ గా పరిగణించొచ్చు అనే సంగతి ఇండ్రస్ట్రీకి అర్థమైంది. ఇప్పుడు సమంత ఖాతాలో మరో ఐటెమ్ సాంగ్ చేరినట్టు ఇండ్రస్ట్రీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఈసారి.. విజయ్ దేవరకొండ పక్కన సమంత ఐటెమ్ గాళ్ గా కనిపించనుందట.
పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో `లైగర్` రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ ఐటెమ్ గీతం ఉంది. ఆ పాటలో స్టార్ హీరోయిన్ కనిపించాలి. ఆ ఛాన్స్ సమంతకి దక్కినట్టు సమాచారం. పూరి సినిమాల్లో ఐటెమ్ గీతాలకు మంచి క్రేజ్ ఉంటుంది. డిఫరెంట్ కాన్సెప్టులతో ఆయన ఐటెమ్ పాటల్ని చేరుస్తుంటారు. ఈసారి కూడా మంచి కాన్సెప్ట్ దొరికిందని తెలుస్తోంది. పూరి సినిమా, పైగా విజయ్ హీరో... అన్నింటికి మంచి ఇది పాన్ ఇండియా ప్రాజెక్టు. కాబట్టి.. నో చెప్పడానికి సమంత దగ్గర కూడా కారణం లేకపోవొచ్చు.