తెలుగులో రూపుదిద్దుకున్న రెండు భారీ చిత్రాలు.. ఆర్.ఆర్.ఆర్, రాధే శ్యామ్. రెండూ పాన్ ఇండియా సినిమాలే. రెండూ సంక్రాంతికే రావాలనుకున్నాయి. కానీ రెండూ అనుకోకుండా వాయిదా పడ్డాయి. ఈ రెండు చిత్రాల టార్గెట్ వేసవే. అయితే ముందుగా ఆర్.ఆర్.ఆర్ తొలి అడుగు వేసింది. మార్చి 18 లేదా ఏప్రిల్ 28న `ఆర్.ఆర్.ఆర్`ని విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించేసింది. మరి... రాధే శ్యామ్ ఎప్పుడు అనేదే ప్రశ్న.
ఆర్.ఆర్.ఆర్ కంటే ముందే రాధే శ్యామ్ ని తీసుకురావాలనుకున్నారు. మార్చి 18న రాధే శ్యామ్ విడుదల అవుతుందని ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు ఆ డేట్ ని ఆర్.ఆర్.ఆర్ లాక్ చేసేసింది. దాంతో మరో డేట్ చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఫిబ్రవరి నెలాఖరుకి పరిస్థితులు చక్కబడితే.. మార్చి 18న ఆర్.ఆర్.ఆర్ వస్తుంది. అలా వస్తే.. మార్చి తొలి వారంలోనే రాధే శ్యామ్ ని విడుదల చేస్తారు. ఒకవేళ అప్పటికీ పరిస్థితులు ఇలానే ఉంటే... ఏప్రిల్ 28న ఆర్.ఆర్.ఆర్ ని చూడగలం. ఒకవేళ.. ఆర్.ఆర్.ఆర్.. ఏప్రిల్ 28కి వెళ్తే మార్చి చివరి వారంలో గానీ, ఏప్రిల్ తొలి వారంలో గానీ రాధే శ్యామ్ వస్తుంది. కానీ ఇదంతా ఈజీ కాదు. రాధే శ్యామ్ పాన్ ఇండియా సినిమా కాబట్టి, దేశ వ్యాప్తంగా ఉన్న పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి. అక్కడ థియేటర్లు అందుబాటులో ఉండాలి. ఇదంతా రాధే శ్యామ్ కి గందరగోళ వ్యవహారమే.