మలయాళ హాట్ స్టార్ షకీలా గురించి తెలియని వారుండరు. మలయాళ చిత్ర సీమను ఒకప్పుడు ఏక చత్రాధిపత్యంతో ఏలిన శృంగార తార షకీలా. మలయాళంలోనే కాదు, తెలుగు, తమిళ భాషల్లోనూ షకీలాకి శృంగార తారగా మంచి పేరుంది. అప్పట్లో ఆమె రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.? రోజుకు మూడున్నర లక్షలు. సినిమా బడ్జెట్టే 20 లక్షలైతే, అందులో రోజుకు మూడున్నర లక్షలు షకీలాకే చెల్లించేవారు. అలాంటిది ఆమె సంపాదన ఏ రేంజ్‌లో ఉంటుందో కదా.. అనుకుంటారు. కానీ, ప్రస్తుతం చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతోందామె. మరి, సంపాదించిన డబ్బంతా ఏం చేసినట్లు.? అంటే, ఓ దీన గాధను చెప్పుకొచ్చిందామె. తన అక్కను నమ్మి ఆమె చేతుల్లో సంపాదించిన సొమ్ము పెట్టిందట.
అయితే, అక్క మోసం చేయడంతో, ఎలా సంపాదించిందో అలాగే ఆ సొమ్మున్నీ పోగొట్టుకోవల్సి వచ్చిందంటూ షకీలా ఆవేదన వ్యక్తం చేసింది. నిజానికి ఇష్టపడి శృంగార తారగా సినిమాలు చేయలేదట షకీలా. కుటంబ కష్టాలు ఆమెను అలా ఆ సినిమాలకు ప్రోత్సహించాయట. ఇకపోతే, అప్పట్లో కోట్లు ఖర్చు పెట్టి తీసిన సూపర్ స్టార్ల సినిమాలకు షకీలా సినిమాలు గట్టి పోటీగా నిలిచిన సందర్భాలు కోకొల్లలు. కొన్నిసార్లు స్టార్ హీరో సినిమాలు సైతం షకీలా సినిమా కోసం వాయిదాలు వేసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయంటే నమ్మి తీరాల్సిందే.
నిజానికి షకీలా నటించిన సినిమాలకు కథా, కాకరకాయ ఏమీ ఉండేది కాదు, సినిమాలో అసలు షకీలా హీరోయినే కాదు. పోస్టర్‌పై మాత్రమే ఆమె బొమ్మలుండేవి. సినిమాలోని వల్గర్ సీన్స్ అన్నీ మరో హీరోయిన్‌తో చిత్రీకరించేవారు. కానీ, షకీలాకి ఉన్న ఫాలోయింగ్ అలాంటిది. ఆమె పేరు, పోస్టర్‌పై ఆమె బొమ్మ ఉంటే చాలు ఆ సినిమాకి కాసుల పంట పండేదంతే.