పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి, హీరోయిన్ అయిన రేణూ దేశాయ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో ఓ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్‌కి ఆమె సమాధానమిచ్చారు. ఇంతకీ ఏంటా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అంటే, తల్లి పాత్రలకు ఆమె సిద్ధంగా ఉందట. అది కూడా యంగ్ హీరోస్‌కి తల్లిగా కాదు, ఏకంగా మహేష్ వంటి స్టార్ హీరోకే తల్లిగా నటించేస్తానంటోంది. అయితే కండిషన్స్ అప్లై అట. ఏంటా కండిషన్స్ అంటే, ముసలి పాత్రలో ఆమెని అందంగా చూపించగలిగే డైరెక్టర్ ఉంటేనే ఆ పాత్రకు తాను సిద్ధమంటోంది. భలే మెలిక పెట్టింది కదా.. ముసలి పాత్రలో అందమేంటబ్బా.. అని తలలు పట్టుకుంటున్నారు.. ఫ్యాన్స్.
అయితే, ఎందుకు కాకూడదు.. ‘బాహుబలి’ సినిమాలో ప్రబాస్ తల్లి, రాజమాత అయిన శివగామిని రాజమౌళి ఎంత అందంగా చూపించలేదూ.. అలా పాత్రకు ఆహార్యంతో పాటు, అందం కూడా ఉంటే, ఆ పాత్ర పోషించడానికి రేణూ దేశాయ్ సిద్ధంగా ఉందట. చాలా రోజులుగా రేణూ దేశాయ్ రీ ఎంట్రీపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజా ఇంటర్వ్యూని బట్టి రేణూ రీ ఎంట్రీకి సర్వం సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తోంది. వదినా, అక్క పాత్రలే కాకుండా, తల్లి పాత్రలకూ తాను సై అంటూ సంకేతాలు పంపించేస్తోంది రేణూ. అయితే ఇంతవరకూ ఆమె ఏ ప్రాజెక్ట్‌కీ సైన్ చేసినట్లు లేదు. కానీ, త్వరలోనే ఓ స్టార్ హీరో ప్రాజెక్ట్‌తో రేణూ రీ ఎంట్రీ షురూ అని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.