ఆడబిడ్డకు జన్మనిచ్చిన నటి స్నేహ.!

మరిన్ని వార్తలు

ఒకప్పటి హీరోయిన్‌, ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్న ముద్దుగుమ్మ స్నేహ తాజాగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తమిళ నటుడు ప్రసన్న కుమార్‌తో స్నేహ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరికీ విహాన్‌ అనే నాలుగేళ్ల బాబున్నాడు. తాజాగా ఆడపిల్లకి జన్మనిచ్చింది స్నేహ. నాగార్జున, వెంకటేష్‌, బాలయ్య తదితర స్టార్‌ హీరోలతో ఒకప్పుడు స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న స్నేహ ఇటీవలి కాలంలో వదినమ్మలా, అక్కలా స్పెషల్‌ పాత్రల్లో కనువిందు చేస్తున్నారు. కొన్ని టీవీ షోలతోనూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. భర్తతో కలిసి కొన్ని వాణిజ్య ప్రకటనల్లోనూ కనిపిస్తున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Its a girl❤❤

A post shared by Sneha Prasanna (@realactress_sneha) on

ఈ రోజు అనగా నేషనల్‌ గాళ్‌ చైల్డ్‌ డే సందర్భంగా స్నేహ ఓ గాళ్‌ చైల్డ్‌కి జన్మనివ్వడం సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా స్నేహ దంపతులకు సినీ ప్రముఖులు ట్విట్టర్‌ వేదికగా కంగ్రాట్స్‌ చెబుతున్నారు. గతేడాది స్నేహ మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నటించిన 'వినయ విధేయ రామ' సినిమాలో చరణ్‌కి వదినగా పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించారు. తమిళ హీరో ప్రశాంత్‌ ఆమెకు జోడీగా నటించారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS