త్రిష పెళ్లి క్యాన్సిల్‌ వెనక కారణమదేనేమో!

మరిన్ని వార్తలు

ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకున్నా, పెళ్లి తర్వాత చిన్న చిన్న కారణాలు చెప్పి, ఆ పెళ్లిళ్లను బ్రేకప్‌ చేసుకుంటున్నారు అందాల తారలు. ఇక కొందరైతే, పీటల దాకా చేరిన పెళ్లిని కూడా కాదనుకుంటున్నారు. ప్రేమ, పెళ్లి వంటి వ్యవస్థల పట్ల సెలబ్రిటీలకున్న చిన్న చూపు ఎప్పటికప్పుడే చర్చనీయాంశమవుతూ వస్తోంది. ఇకపోతే, తాజాగా సీనియర్‌ భామ త్రిష పెళ్లిపై స్పందించిన తీరు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అయ్యింది. నిశ్చితార్ధం చేసుకుని, పీటల వరకూ చేరిన పెళ్లిని బ్రేకప్‌ చేసుకున్న ముద్దుగుమ్మ త్రిష అన్న సంగతి అందరికీ తెలిసిందే. కెరీర్‌ అనే వంకతో ఆమె పెళ్లికి దూరమైంది. ఆమె భావించినట్లుగానే ఆ తర్వాత కెరీర్‌లో ఫుల్‌ బిజీ అయిపోయింది త్రిష.

 

ప్రస్తుతం పెళ్లి గురించి ఆలోచించేంత టైమ్‌ కూడా లేనంత బిజీగా గడుపుతోంది త్రిష. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో త్రిష క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. తెలుగులో మెగాస్టార్‌ సరసన త్రిష హీరోయిన్‌గా ఫిక్సయిన సంగతి తెలిసిందే. అలాగే మలయాళ మెగాస్టార్‌ మోహన్‌లాల్‌కి భార్యగా 'రామ్‌' చిత్రంలో నటిస్తోంది. తమిళంలో త్రిష చేతిలో చెప్పలేనన్ని వరుస ప్రాజెక్టులున్నాయి. ఇదంతా సరే, ఇంతకీ త్రిష పెళ్లి గురించి ఏమన్నదనేగా.. మీ ప్రశ్న. సమాధానమిదిగో.. 'వివాహ వ్యవస్థపై నాకు అంతగా నమ్మకం లేదనుకుంటున్నాను..' అని త్రిష అభిప్రాయపడుతోందట. అందుకేనేమో నిక్షేపంలా నిశ్చితార్ధమయిన పెళ్లిని క్యాన్సిల్‌ చేసుకుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS