ఆమిర్ ఖాన్ దంగల్ చిత్రంలో ప్రధాన భూమిక పోషించిన ఫాతిమా సనా షేక్ కి ఒక హెచ్చరిక వచ్చినట్టు బాలీవుడ్ వర్గాల కథనం.
ఫాతిమా పోయిన రంజాన్ మాసంలో తన హాట్ ఫోటోలని ఆయా ఫోటో షూట్స్ ని సోషల్ మీడియా ద్వారా అందరికి పోస్ట్ చేయడంతో ఆమె పైన కొందరు యువకులు సోషల్ మీడియాలో మండిపడిన సంఘటన అందరికి తెలిసిందే. దీనితో ఒక్కసారిగా ఈ అంశం పతాక శీర్షికలకి ఎక్కింది.
ఇక ఇప్పుడు అదే తరహాలో కొన్ని ఫోటోలు పెడుతుండడంతో ఆమె నటిస్తున్న తగ్స్ అఫ్ హిందూస్తాన్ చిత్ర యూనిట్ సభ్యులు సున్నితంగా హెచ్చరించారట! ఈ చిత్రం విడుదలయ్యే వరకు తమకి తెలియచేయకుండా ఎటువంటి ఫొటోస్, వీడియోస్ పెట్టడం కాని చేయకండి అని చెప్పారట!
ఇదే కాకుండా ఈ చిత్రం పూర్తయ్యేవరకు వేరే ఏ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వొద్దు అని కూడా సూచించారట. దీనితో ఇక ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ లో ఇక ముందు తన కొత్త ఫోటోలని చూసే అవకాశం ఆమె అభిమానులు కోల్పోనున్నారు.