బిగ్‌బాస్‌లో ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేదెవరంటే!

By iQlikMovies - August 06, 2019 - 12:30 PM IST

మరిన్ని వార్తలు

15 మంది కంటెస్టెంట్స్‌తో స్టార్ట్‌ అయిన బిగ్‌బాస్‌ హౌస్‌ నుండి ఇప్పటికే ఇద్దరు ఎలిమినేట్‌ అయ్యారు. మొదటి ఎలిమినేషన్‌ గా హేమ హౌస్‌ నుండి బయటికొచ్చాక, ఆ ప్లేస్‌ని తమన్నాతో రీప్లేస్‌ చేశారు. ఇక సెకండ్‌ ఎలిమినేషన్‌గా జాఫర్‌ని బయటికి తీసుకొచ్చేశారు. జాఫర్‌ బయటికొచ్చాక, బిగ్‌ హౌస్‌కి సంబంధించి పలు కీలక అంశాలు రివీల్‌ అయిన సంగతి తెలిసిందే. ఇక హౌస్‌లో ఉన్న 14 మంది కంటెస్టెంట్స్‌లో ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేందుకు రాహుల్‌, తమన్నా, వితిక, పునర్నవి, బాబా భాస్కర్‌ నామినేట్‌ అయ్యారు.

 

అయితే, వీరిలో ఎవర్ని ఈ వారం బయటికి పంపిస్తారనే అంశంపై ఆశక్తికరమైన చర్చ జరుగుతోంది. తమన్నా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాక హౌస్‌లో వాతావరణమే మారిపోయింది. అసభ్యకరంగా తయారైంది. తమన్నాతో బిగ్‌బాస్‌ టీమ్‌ ఏం చేయించాలనుకున్నారో ఈ పదిహేను రోజుల్లో చేయించి చూపిస్తున్నారనే టాక్‌ సోషల్‌ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది. లేటెస్ట్‌ ఎపిసోడ్‌లో తమన్నా బిహేవియర్‌కి హౌస్‌ మేట్స్‌ అందరిలోనూ అసహనం నెలకొంది.

 

సో ఈ వీక్‌ ఎలిమినేషన్‌లో ఎడ్జ్‌ తమన్నాకే ఉంది. లేక, తమన్నా రచ్చ ఇంకొంత కాలం హౌస్‌లో కొనసాగించాలనుకుంటే, బాబా భాస్కర్‌ని బయటికి పంపిస్తారేమో. పునర్నవి, వితిక, రాహుల్‌ స్ట్రాంగ్‌ క్యాండిడేట్స్‌ కావడంతో, ఇప్పుడప్పుడే ఆ ముగ్గురిలో ఏ ఒక్కరూ ఎలిమినేట్‌ అయ్యే ఛాన్స్‌ లేదు. సో ఏది ఏమైనా ఈ సారి ఎలిమినేషన్‌ కాస్త ఆసక్తికరంగానే మారిందనాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS