టాలీవుడ్‌ని కుదిపేస్తున్న 'కాస్టింగ్ కౌచ్' వివాదం తీవ్ర రూపం దాల్చి తెర మీదికి రావడంతో, ఈ విషయంలో పలువురు నటీమణులు బయటికి వచ్చి తమ తమ అభిప్రాయాలను, అనుభవాలను చెబుతున్నారు. అందులో భాగంగా 'హార్ట్‌ఎటాక్' సినిమాతో క్యూట్ అప్పీల్‌తో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ ఆదాశర్మ తాజాగా స్పందించింది.
' నాకెప్పుడూ కాస్టింగ్ కౌచ్ ఎదురు పడలేదు. అవకాశాల కోసం ఎవరు దిగజారినా అది తప్పే, అవకాశాలు ఇస్తానని లోబర్చుకున్నా తప్పే. అవకాశాల కోసం లొంగిపోవడమూ తప్పే. సినిమా ఒక ప్యాషన్ కావచ్చు. ఆ సినిమా కోసం మానాన్ని పనంగా పెట్టాల్సిన అవసరం లేదు. అమ్మాయిలకు నేనిచ్చే సలహా ఇది' అని ఆదాశర్మ చెప్పింది.
రమ్యనంబీసన్ అనే ఓ తమిళ నటి 'సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉంది కానీ నేను చూడలేదు. కొంతమంది చెబితే విన్నాను. అలాంటి దుస్సాంప్రదాయం పూర్తిగా పోవాలి..' అని చెప్పింది. అలాగే టాలీవుడ్ నుండే కాదు, కోలీవుడ్, బాలీవుడ్ నుండి కూడా పలువురు ఈ అంశంపై స్పందిస్తున్నారు. అయితే కాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినీ పరిశ్రమకి సంబంధించిన ఇష్యూనే కాదు, ప్రతీ రంగంలోనూ, ప్రతీ వర్కింగ్ ప్లేస్‌లోనూ, ప్రపంచం మొత్తం ఉంది అనేది ప్రముఖులు చెబుతున్న మాట. అది నిజమే కూడా.
సినీ పరిశ్రమలో తాజాగా రైజ్ అయిన ఈ ఇష్యూకి సంబంధించి, ఇకపై కాస్టింగ్‌కౌచ్ నిర్మూలించే క్రమంలో కొన్ని కమిటీలు ఏర్పాటు చేసే దిశగా చిత్ర యూనిట్ నిర్ణయాలు తీసుకుంటోంది. కొన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. చూడాలి మరి, ఈ ప్రణాళికలు ఎంతవరకూ దిశా నిర్దేశం చేస్తాయనేది.