గ్లామర్‌లో ఎలాంటి వేరియేషన్ చూపించాలో ఆదాశర్మకు తెలిసినంతగా మరో బ్యూటీకి తెలియదేమో అనుకోవాలి. డ్రస్సుల్లో పొదుపు చూపినా, ఆ పొదుపులోనూ ఏదో మ్యాజిక్ చేస్తుంది. ఆ మ్యాజిక్‌తోనే ఆడియన్స్‌ని కట్టిపాడేస్తుంటుంది. హెయిర్ స్టైల్స్‌లోనూ ఆదాశర్మకు మంచి పట్టుంది. తన నల్లని అందమైన కురుల్ని రకరకాల కలర్స్‌తో తీర్చి దిద్దే టాలెంట్ ఆదాశర్మకు మాత్రమే ఉందనడం అతిశయోక్తి కాదు. ఈ తాజా పిక్‌లో చూశారుగా, అల్ట్రా మోడ్రన్ కాస్ట్యూమ్, దానికి కాంట్రస్ట్‌గా హెయిర్ కలర్. పర్పుల్ కలర్డ్ హెయిర్‌తో తనలోని గ్లామర్నిలా చూపించిందీ సారి. ఏ లుక్‌లోనైనా, ఏ డ్రస్సులోనైనా ఆదాశర్మ క్యూట్‌నెస్‌కి ఫ్యాన్స్ ఫిదా అంతే. ఎప్పటికప్పుడే ఫ్యాన్స్‌ని నిరాశపరచకుండా, ఆదాశర్మ తన గ్లామర్‌లో ఇలాంటి మ్యాజిక్కులు, జిమ్మిక్కులు చేస్తూనే ఉంటుంది. చూసి ఆస్వాదించడమే.