'తెలుగందం' ఈసారైనా అందుకుంటుందా 'విజయం'.?

By iQlikMovies - August 03, 2018 - 18:44 PM IST

మరిన్ని వార్తలు

ఎన్నో ఒడుదుడుకులు, టఫ్‌ సిట్యువేషన్స్‌ని తట్టుకుని అందాల పోటీలో విజయం సాధించిన తెలుగు ముద్దుగుమ్మలు గ్లామర్‌ తెరపై మాత్రం సక్సెస్‌ కాలేకపోతున్నారు. గతంలో రవిబాబు సినిమా 'అమరావతి' గుర్తుంది కదా. భూమిక, తారక రత్న ప్రధాన పాత్రల్లో తెరకెక్కింది ఆ సినిమా. 

ఆ సినిమాలో మరో క్యారెక్టర్‌ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. రవిబాబు అండ్‌ టీమ్‌లో పోలీసాఫీసర్‌ పాత్రలో కనిపించిన ముద్దుగుమ్మ గద్దె సింధూర. ఈ ముద్దుగుమ్మ కూడా అందాల పోటీ నుండి సినిమా రంగంలోకి అడుగుపెట్టిందే. అయితే అందాల పోటీలో కిరీటం సాధించింది కానీ, సినీ రంగంలో హీరోయిన్‌గా రాణించలేకపోయింది. తాజాగా మరో ముద్దుగుమ్మ ఇలాగే కోటి ఆశలతో హీరోయిన్‌గా వెలిగిపోవాలనుకుంటోంది. 

ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చింది. అదే 'గూఢచారి' సినిమా. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. అడవిశేష్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో 2013అందాల పోటీలో మిస్‌ ఇండియా కిరీటం సాధించిన ముద్దుగుమ్మ శోభితా ధూళిపాళ్ల హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. సినిమా ప్రమోషన్స్‌లో అమ్మడు సూపర్‌ హాట్‌ అప్పీల్‌ ఇచ్చేసింది. 

సినిమాలో ఏం చేసిందో ఏమో కానీ, తెలుగమ్మాయిలకు తెలుగు సినిమాల్లో అవకాశాలు రావటం లేదు అంటున్నారే కానీ, వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడం లేదు. అప్పుడు గద్దె సింధూర అలా మాయమైపోయింది. ఇప్పుడు శోభితా ధూళిపాళ్ల ఏం చేస్తుందో చూడాలి మరి. 'గూఢచారి' సినిమాపై భారీగా అంచనాలున్నాయి. వన్స్‌ సినిమా హిట్‌ అయ్యిందంటే ఈ తెలుగమ్మాయి దశ మారిపోయినట్లే.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS