'కల్కి'కి జోడీగా ఆ హాట్‌బ్యూటీ.!

By iQlikMovies - October 30, 2018 - 18:40 PM IST

మరిన్ని వార్తలు

'గరుడవేగ' సినిమాతో బౌన్స్‌ బ్యాక్‌ అయిన సీనియర్‌ హీరో రాజశేఖర్‌ తాజా చిత్రం 'కల్కి'. 'అ' చిత్రంతో ప్రేక్షకుల్నీ, ఇండస్ట్రీ దృష్టినీ ఆకర్షించిన యంగ్‌ అండ్‌ డైనమిక్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో రాజశేఖర్‌ సరసన హీరోయిన్‌గా బబ్లీ గాళ్‌ ఆదాశర్మ ఎంపికైంది. 

ఆల్రెడీ ఈ సినిమాలో నందితా శ్వేత హీరోయిన్‌గా కీలక పాత్రలో నటిస్తోంది. తాజాగా ఆదాశర్మ పేరు తెరపైకి వచ్చింది. ఆదాశర్మ నటించిన 'క్షణం' చిత్రం వచ్చి చాలా కాలమే అయ్యింది. ఆ సినిమాతో సూపర్‌ హిట్‌ని తన ఖాతాలో వేసుకుందీ ముద్దుగుమ్మ. అంతకు ముందే అల్లు అర్జున్‌ వంటి స్టార్‌ హీరో సినిమాలో నటించినా ఆదాశర్మకు అవకాశాలు అరకొరగానే అందాయి. ప్రస్తుతం బాలీవుడ్‌లో 'కమాండో 3' సినిమాలోనూ, తమిళంలో ప్రభుదేవాతో 'చార్లీ చాప్లిన్‌ 2' చిత్రంలో నటిస్తోంది. సినిమాల సంగతి ఎలా ఉన్నా, సోషల్‌ మీడియాలో బీభత్సంగా ఫాలోయింగ్‌ సంపాదించుకుంది ఆదాశర్మ. 

తన బబ్లీ గ్లామర్‌కి హాట్‌నెస్‌ జోడిస్తూ, ఆ పిక్స్‌ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ఫ్యాన్స్‌లో పిచ్చ క్రేజ్‌ సంపాదించుకుంది. తాజాగా రాజశేఖర్‌ సినిమాలో ఛాన్స్‌ దక్కినందుకు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతోందట. మల్టీ టాలెంటెడ్‌ అయిన ఆదాశర్మకు సరైన అవకాశమొస్తే తన టాలెంట్‌ ఏంటో చూపిస్తానంటోంది. 

మరి ప్రశాంత్‌ వర్మ 'కల్కి' సినిమాలో ఆదాశర్మ పాత్రను ఎలా డిజైన్‌ చేశాడో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS